రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అనంతరం ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో స్టార్ హీరో ప్రభాస్ ఒకరు. ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.
ఈ విధంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు త్వరలోనే సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా కల్కి, స్పిరిట్ వంటి చిత్రాల షూటింగ్ పనులలో కూడా ప్రభాస్ బిజీగా ఉన్నారు. వీటితో పాటు టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ అందరికీ ఈయన ప్రభాస్ అని మాత్రమే తెలుసు. కానీ ప్రభాస్ పూర్తి పేరు మాత్రం ఎవరికి తెలియదు. అయితే తాజాగా ప్రభాస్ ఆధార్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈయన పూర్తి వివరాలు ఇందులో ఉండటంతో ఈ ఫోటోని కాస్త అభిమానులు వైరల్ చేస్తున్నారు. మరి ప్రభాస్ పూర్తి పేరు ఏంటి ఈయన డేట్ అఫ్ బర్త్ ఏంటి అనే విషయానికి వస్తే…
ప్రభాస్ గా (Prabhas) అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి ఈయన అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ అని ఉంది. ప్రభాస్ అసలు పేరు ఇదేనని తెలుస్తుంది. ఇక ప్రభాస్ పుట్టిన తేదీ విషయానికి వస్తే ఈయన ఆధార్ కార్డు ప్రకారం..23-10-1979 అని ఉంది. ఈ ఆధార్ కార్డ్ ద్వారా చూస్తే ప్రభాస్ వయసు 44 సంవత్సరాల అని తెలుస్తోంది. ఇలా ప్రభాస్ ఆధార్ కార్డు ఫోటో వైరల్ గా మారడంతో అభిమానులు ఆధార్ కార్డును మరింత వైరల్ చేస్తున్నారు.