Prabhas: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుకలో.. చిరంజీవి పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్లు

ప్రభాస్ కి ఇండస్ట్రీలో ఉన్న వాళ్లంతా ఫ్రెండ్సే. అయితే మొగల్తూరు బ్యాచ్ కాబట్టి.. చిరంజీవితో అలాగే అతని ఫ్యామిలీ మెంబర్స్ తో ప్రభాస్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ‘అన్ స్టాపబుల్’ కి వెళ్ళినప్పుడు కూడా చరణ్ తో ఫోన్లో మాట్లాడి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు తిరుపతిలో జరిగిన ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ స్పీచ్ ఇస్తున్నప్పుడు చిరంజీవి ప్రస్తావన కూడా తీసుకురావడం మెగా అభిమానులను ఖుషి చేయిస్తుంది అని చెప్పాలి.

ప్రభాస్ (Prabhas) మాట్లాడుతూ.. “జై శ్రీరామ్… ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. 7 నెలల క్రితం, ఓం రౌత్‌ని 3డిలో తెరకెక్కించమని అభిమానులను కోరాను. అప్పుడు మీరు నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అంతా ఇంతా కాదు. మీ అభిమానమే మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించింది. ఇక ‘ఆదిపురుష్’ ట్రైలర్ ను అభిమానులే మొదట చూడాలి అని ఓం అన్నారు. దీనిని సినిమా అనకూడదు. నా అదృష్టం అనుకోవాలి. ఒకసారి చిరంజీవి గారు అన్నారు.

‘రామాయణం చేస్తున్నావా?’ అని.. అవును సార్ అన్నాను. ‘అది నీ అదృష్టం. ఈ అవకాశం అందరికీ రాదు’ అన్నారు. ‘ఆదిపురుష్’ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అనేది పెద్ద యుద్ధం. నా 20 ఏళ్ళలో నేను ఓం రౌత్ వంటి డైరెక్టర్ ను చూడలేదు. చాలా కష్టపడ్డారు. జానకి లాంటి పాత్ర కృతి సననే చేయాలి. అలాంటి మంచి వ్యక్తి మాత్రమే ఈ పాత్రకి న్యాయం చేయగలదు అనిపించింది. ఇక నేను పెళ్లి తిరుపతిలోనే చేసుకుంటాను.

ఎప్పుడు అన్నది తర్వాత మాట్లాడుకుందాం. నేను తక్కువ మాట్లాడతాను. కానీ ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను. ఒక్కోసారి మూడు కూడా రావచ్చు. సినిమాలు లేట్ అయితే నాకు సంబంధం లేదు. ఐ లవ్ యు డార్లింగ్స్.. జై శ్రీరామ్” అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus