Salaar: సలార్ విషయంలో ఆ అనుమానమే నిజమైందిగా.. ఏమైందంటే?

  • December 9, 2023 / 07:20 PM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ సినిమా రిలీజ్ కు మరో 12 రోజుల సమయం మాత్రమే ఉండటంతో మేకర్స్ తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. సలార్ సినిమాకు ఏ సర్టిఫికెట్ వస్తుందని ఫ్యాన్స్ భావించగా ఆ అనుమానమే నిజమైంది. యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని తెలుస్తోంది.

ఏ సర్టిఫికెట్ వచ్చినా యానిమల్ మూవీ కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించడంతో సలార్ మూవీ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి చిత్రయూనిట్ ను మెచ్చుకున్నారని తెలుస్తోంది. యాక్షన్ లవర్స్ కు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. 2 గంటల 55 నిమిషాల 22 సెకన్ల నిడివితో ఈ సినిమా విడుదల కానుంది.

సలార్ సెకండ్ ట్రైలర్ ఈ నెల 16 లేదా 18 తేదీలలో ఏదో ఒక తేదీన రిలీజ్ కానుంది. ప్రభాస్ ను ఫోకస్ చేస్తూ సెకండ్ ట్రైలర్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. సలార్ సినిమా గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తుండగా సలర్ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి. సలార్1 రిలీజ్ తో సలార్2 సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.

సలార్1 (Salaar) లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై మామూలుగా ఉండదని తెలుస్తోంది. సలార్1 మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా మేకర్స్ కు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించిన ఈ సినిమా బయ్యర్లకు ఏ స్థాయిలో లాభాలను అందిస్తాయో చూడాల్సి ఉంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus