టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న తర్వాత రొటీన్ కథలకు నో చెబుతూ భిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. తను హీరోగా తెరకెక్కుతున్న సినిమాలలో ఒక సినిమా కథకు మరో సినిమా కథకు ఏ మాత్రం పోలిక లేకుండా ఈ స్టార్ హీరో జాగ్రత్త పడుతున్నారు. సినిమాసినిమాకు లుక్ విషయంలో కూడా తేడా ఉండేలా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2020, 2021 సంవత్సరాలలో ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.
అయితే ఆ లోటును భర్తీ చేసేలా ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు రిలీజయ్యే విధంగా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఛత్రపతి, బాహుబలి సిరీస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళితో సినిమా గురించి ప్రభాస్ స్పందించారు.
తనకు రాజమౌళికి మధ్య ఒక చిన్న స్టోరీ ఐడియాకు సంబంధించిన చర్చ జరిగిందని ప్రభాస్ చెప్పుకొచ్చారు. రాజమౌళితో మరో సినిమా కచ్చితంగా చేస్తానని అయితే ఆ సినిమా ఎప్పుడు చేస్తాననే విషయాన్ని మాత్రం తాను చెప్పలేనని ప్రభాస్ కామెంట్లు చేశారు. తాను, రాజమౌళి స్నేహితులం కావడంతో మరో సినిమా చేయాలని రాజమౌళిని అడగాల్సిన అవసరం లేదని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఇద్దరికీ చిన్న ప్లాన్ ఉందని ఆ ప్లాన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదని ప్రభాస్ తెలిపారు.
రాధేశ్యామ్ లో యాక్షన్ కూడా ఉంటుందని ప్రభాస్ చెప్పుకొచ్చారు. రాజమౌళి మహేష్ తో సినిమా తెరకెక్కించిన తర్వాత ప్రభాస్ తో సినిమా తీసే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా క్లైమాక్స్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది.