డార్లింగ్ ఫ్యాన్స్ క్యాలెండర్లో ఈరోజును రెడ్ మార్క్‌తో రాసి పెట్టుకోవాల్సిందే. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ఆ క్రేజీ కాంబినేషన్ సెట్స్ మీదకు వచ్చేసింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ షూటింగ్ ఈరోజు (నవంబర్ 27) అధికారికంగా మొదలైంది. పూజా కార్యక్రమాల హడావిడి ఇప్పటికే పూర్తయింది, ఇప్పుడు గ్రౌండ్‌లో రియల్ వార్ స్టార్ట్ అయ్యింది. మొదటి రోజే దర్శకుడు వంగా, ప్రభాస్‌ను ఒక వైల్డ్ యాక్షన్ మోడ్‌లో ప్రజెంట్ చేస్తున్నాడట.
SPIRIT
సాధారణంగా ఫస్ట్ డే షూట్ అంటే హీరో ఇంట్రడక్షన్ షాట్స్ లేదా సింపుల్ సీన్స్ తీస్తుంటారు. కానీ వంగా రూట్ సెపరేటు కదా! ఈరోజు ఏకంగా ఒక భారీ ఫైట్ సీక్వెన్స్‌తోనే షూటింగ్ మొదలుపెట్టారట. సెట్‌లో ప్రభాస్ గుంపులుగా ఉన్న బౌన్సర్లతో తలపడే ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. రా అండ్ రస్టిక్ యాక్షన్‌కు పెట్టింది పేరైన వంగా, ప్రభాస్ కటౌట్‌ను వాడి ఈ ఫైట్‌ను నెక్స్ట్ లెవెల్‌లో డిజైన్ చేశాడని సమాచారం.
అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం ప్రభాస్ కాస్ట్యూమ్. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని, ఖాకీ డ్రెస్సులో కనిపిస్తారని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. లొకేషన్‌లో ప్రభాస్ ‘ఖైదీ’ గెటప్‌లో కనిపిస్తున్నారట. ఖాకీ చొక్కా బదులు ఖైదీ డ్రెస్సులో ప్రభాస్ బౌన్సర్లను చితక్కొడుతుంటే, ఆ సీన్ వెనుక ఉన్న కథ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఖైదీ గా డార్క్ ఆడియో టీజర్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ షెడ్యూల్ ప్లానింగ్ కూడా చాలా పకడ్బందీగా జరిగింది. నేటి నుంచి మూడు రోజుల పాటు, అంటే నవంబర్ 29 వరకు నాన్ స్టాప్‌గా ఈ ఫైట్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తారు. ఆ తర్వాత నవంబర్ 30న టీమ్ ఒక రోజు చిన్న బ్రేక్ తీసుకోనుంది. ఆ గ్యాప్ తర్వాత, డిసెంబర్ 1వ తేదీ నుంచి మళ్ళీ ఫ్రెష్ షెడ్యూల్ మొదలవుతుంది. అక్కడి నుంచి షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగుతుందని టాక్.
