ప్రభాస్ లేకుండా బాహుబలి సినిమాని ఉహించుకోవడం అసాధ్యం. అతని రూపం, రాజసం, నటనతో సినిమాకి భారీ తనం తెచ్చారు. ఐదేళ్లు కష్టపడి ఎప్పటికి నిలిచిపోయే కళాకండాలను అందించారు. అటువంటి వ్యక్తికి చిన్నప్పుడు నటనపై ఆసక్తి ఉండేది కాదంట. తన పెదనాన్న కృష్ణం రాజు స్టార్ హీరోగా ఉన్నప్పటికీ ఆ వైపు అడుగులు వేయాలని అనుకోలేదని ప్రభాస్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూ లో ప్రభాస్ మాట్లాడుతూ..”ఇంట్లో వాళ్ళు సినిమాలు చేస్తావా ? అని రెండు మూడు సార్లు అడిగారు. అప్పుడు వద్దు అన్నాను. ఓ రెస్టారెంట్ పెట్టాలని ఆలోచనను వాళ్ళ ముందు ఉంచాను. మా వాళ్ళు భోజన ప్రియులు కావడంతో వెంటనే ఓకే చెప్పారు.
ఆ ఆలోచనల్లో ఉండగానే కృష్ణంరాజు, బాపు కాంబినేషన్ లో వచ్చిన భక్త కన్నప్ప నా ఆలోచనను మార్చింది. నటనపై ఆసక్తిని కలిగించింది. అప్పుడే హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యా. ఆ విషయాన్ని ముందు స్నేహితులకి చెప్పాను. ఆ తరువాత ఇంట్లో చెప్పాను” అని వివరించారు. తన డ్రీమ్ ని మొదట షేర్ చేసుకున్న మిత్రులు ఎవరో కాదు వంశీ, ప్రమోద్ లే. వీరి బ్యానర్లోనే ప్రభాస్ మిర్చి చేశారు. ఇప్పుడు సాహో చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న సాహోపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.