Prabhas: రెమ్యునరేషన్ లేకుండా ప్రభాస్ చిన్న సినిమా!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత తన స్థాయిని ఒక్కసారిగా ఆకాశానికి పెంచేసుకున్నాడు అనే చెప్పాలి. అతనితో సినిమా చేయాలని ఇండియన్ సినిమా ప్రపంచంలో ఉన్న స్టార్ దర్శకులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కూడా తన రేంజ్ కు తగ్గట్టుగా చాలా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒక విధంగా చిన్న సినిమాలు ఒకే సీబీస్తున్నప్పటికి కూడా అవి చివరికి రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు గా మారిపోతున్నాయి.

Click Here To Watch Now

అసలైతే ప్రభాస్ సాహో సినిమా తర్వాత వందకోట్ల బడ్జెట్ లోపే కొన్ని సినిమాలు చేయాలి అనుకున్నాడు. కానీ వచ్చిన అవకాశాలను మిస్ చేసుకోకూడదు అని పెద్ద ఆఫర్లు రావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ నిజానికి ప్రభాస్ మనసులో మాత్రం కొన్ని చిన్న సినిమాలు కూడా చేయాలని ఎంతో ఆశగా ఉంది. అందుకే ఇటీవల యూవీ క్రియేషన్స్ మరోసారి చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రభాస్ వీలైనంత త్వరగా చిన్న బడ్జెట్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట.

అది కూడా రెమ్యునరేషన్ లేకుండానే సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ 150కోట్ల పారితోషికం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుత రోజుల్లో కొంతమంది హీరోలు పారితోషికం తీసుకోకుండా సినిమా సక్సెస్ అయిన తర్వాత అందులో లాభాలను తీసుకుంటున్నారు. ఒక విధంగా అది నిర్మాతలకు చాలా హెల్ప్ అవుతుంది అనే చెప్పాలి. ఇక ప్రభాస్ కూడా మారుతి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం పారితోషికం లేకుండానే సినిమా చేయాలని అనుకుంటున్నాడట.

ఒకవేళ అది కుదరకపోతే మరొక సినిమాను అయినా సరే చాలా తక్కువ బడ్జెట్లోనే పూర్తి చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా దాదాపు చిన్న బడ్జెట్ లో రానున్నట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కబోయే ఆ సినిమాకు రాజా డీలక్స్ టైటిల్ను ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమాకు థమన్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus