Prabhas: ప్రభాస్ పై మరో రూమర్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘ఆదిపురుష్’ సినిమాను పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’ సినిమాల్లో నటిస్తున్నారు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా ప్రభాస్ సినిమాలకు సంబంధించి కాకుండా.. ఆయన పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మూడు వారాల క్రితం ఆయన పెళ్లి గురించి ఓ వార్త చక్కర్లు కొట్టింది. ‘

ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ సరసం హీరోయిన్ గా నటించిన కృతిసనన్ ను రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని కొన్ని వెబ్ సైట్స్ లో ప్రచారం జరిగింది. దీంతో కృతిసనన్ స్పందించక తప్పలేదు. మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తల్లో నిజం లేదని.. తనకు నిజంగానే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే నేరుగా చెబుతానని వెల్లడించింది.

అక్కడితో ఈ పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు ప్రభాస్ గురించి మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. తాజాగా ఆయన హైదరాబాద్ లోని తన సంబంధించిన ఓ ప్రాపర్టీపై బ్యాంక్‌లో రూ. 21 కోట్లు లోన్ తీసుకున్నారట. దీనికి సంబంధించిన చెక్ బుధవారం ఆయన చేతికి అందిందట. సినిమాకి రూ.100 కోట్లు చొప్పున రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ కి సడెన్ గా రూ.21 కోట్ల లోన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందా..? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

కొందరు అభిమానులు అది ఆయన వ్యక్తిగతమని.. దానిపై డిస్కషన్ అవసరం లేదని కామెంట్స్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ కొన్ని వ్యాపారాలపై పెట్టుబడులు పెడుతున్నారు. అందుకే వరుస సినిమాలు చేస్తూ.. డబ్బు వెనకేస్తున్నారు. ఇప్పుడు దానికోసమే లోన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus