ఈ మధ్య కాలంలో ప్రతి నెలా విడుదలయ్యే ఆర్మాక్స్ సర్వే ఫలితాలలో ప్రభాస్ (Prabhas) వరుసగా నంబర్ వన్ స్థానంలో నిలుస్తూ ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తున్నారు. ఆర్మాక్స్ మీడియా మార్చి నెల సర్వే ఫలితాలలో ప్రభాస్ తొలి స్థానంలో ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) రెండో స్థానంలో ఉన్నారు. గుంటూరు కారం ఓటీటీలో అన్ని భాషల్లో అందుబాటులోకి రావడం మహేశ్ కు మరింత ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు (Allu Arjun) ఈ జాబితాలో మూడో స్థానం దక్కింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నాలుగో స్థానంలో నిలవగా స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) ఐదో స్థానంలో నిలిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) ఈ జాబితాలో ఆరో స్థానం దక్కింది. న్యాచురల్ స్టార్ నాని (Nani) ఏడో స్థానంలో నిలవగా మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) ఎనిమిదో స్థానంలో నిలిచారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తొమ్మిదో స్థానంలో నిలవగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పదో స్థానంలో నిలిచారు.
ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండటం కలిసొచ్చిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. సలార్ సినిమా సక్సెస్ కూడా ప్రభాస్ కు మరింత ప్లస్ అయిందని నెటిజన్లు చెబుతున్నారు. బాహుబలి2 రేంజ్ హిట్ ప్రభాస్ ఖాతాలో చేరితే మాత్రం ప్రభాస్ ను ఎవ్వరూ ఆపలేరని ఫ్యాన్స్ చెబుతుండగా ప్రభాస్ కు ఆ రేంజ్ హిట్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ప్రభాస్ మరికొన్ని నెలల పాటు ఈ సర్వేలో నంబర్ వన్ స్థానం కొనసాగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు చెబుతున్నారు. ప్రభాస్ రెమ్యూనరేషన్ పరంగా ఇతర హీరోలకు అందని స్థాయిలో ఉన్నారు. కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం ప్రభాస్ కు తిరుగులేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రభాస్ క్రేజ్ వేరే లెవెల్ అని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు.