టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరో ఎవరనే ప్రశ్నకు హీరో ప్రభాస్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. అయితే బన్నీ కూడా ఈ జాబితాలో చేరారని సమాచారం. పుష్ప2 సినిమా కోసం గతంలో హిందీ హక్కులను బన్నీ డిమాండ్ చేశారని వార్తలు ప్రచారంలోకి రాగా బన్నీ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని ప్రస్తుతం ఈ సినిమాకు 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని తెలుస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమా కోసం 50 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
పుష్ప2 సినిమా బడ్జెట్ సులువుగా 250 కోట్ల రూపాయలు దాటుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హిందీలో పుష్ప2 సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సైతం ఖర్చు విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో ప్రభాస్, బన్నీ మధ్య ఒక విధంగా పోటీ మొదలైంది. భవిష్యత్తులో ఎవరి రెమ్యునరేషన్ మరింత పెరుగుతుందో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో మార్కెట్ పెరిగినా చరణ్, తారక్ లకు భారీగా రెమ్యునరేషన్ పెరగలేదని సమాచారం అందుతోంది.
పుష్ప2 సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుందని బోగట్టా. కేజీఎఫ్2 సక్సెస్ తర్వాత పుష్ప ది రూల్ స్క్రిప్ట్ లో మార్పులు జరిగాయని తెలుస్తోంది. పుష్ప ది రూల్ ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండేలా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బన్నీ కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తూ ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నారు. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం పాన్ ఇండియా సినిమాలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయని తెలుస్తోంది.
బన్నీ బోయపాటి శ్రీను కాంబో గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటించడానికి బన్నీ సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!