హనుమాన్ (Hanu-Man) మూవీ అంచనాలకు మించి విజయం సాధించిన నేపథ్యంలో జై హనుమాన్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. జై హనుమాన్ సినిమా నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ కాగా ఆ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నిప్పులు కక్కుతున్న డ్రాగన్ ఎదురుగా హనుమాన్ ఉన్న పోస్టర్ ను మేకర్స్ విడుదల చేయడం గమనార్హం. చైనా సినిమాలకే డ్రాగన్ కాన్సెప్ట్ పరిమితం కాగా ఇకపై ఇండియా సినిమాలు సైతం ఈ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్నాయి.
ఈ సినిమాను ఐమ్యాక్స్ 3డీ ఫార్మట్ లో కూడా రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచాలనే ఆలోచనతో మేకర్స్ ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మకు (Prasanth Varma) జై హనుమాన్ మూవీ విషయంలో బడ్జెట్ నిబంధనలు లేకపోవడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
బాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. హనుమాన్ మూవీ ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకోగా 25 సెంటర్లలో ఈ సినిమా 100 రోజులు ప్రదర్శించబడటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది. ఈ మధ్య కాలంలో ఇన్ని సెంటర్లలో 100 రోజులు ఆడిన సినిమా హనుమాన్ మాత్రమేనని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
జై హనుమాన్ సినిమా హక్కులకు ఇండస్ట్రీలో భారీ పోటీ ఉండే అవకాశం ఉంది. మెజారిటీ ఏరియాలలో హనుమాన్ హక్కులను కొనుగోలు చేసిన నిర్మాతలే జై హనుమాన్ మూవీ హక్కులను తీసుకునే అవకాశాలు ఉంటాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో అప్ డేట్స్ అయితే రానున్నాయని సమాచారం అందుతోంది. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో మరోసారి మ్యాజిక్ చేయాలనే కసితో పని చేస్తున్నారు.