‘జిఏ2 పిక్చర్స్’ అండ్ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మించిన తాజా చిత్రం ‘ప్రతీరోజు పండగే’. ఈ ఏడాది ‘చిత్రలహరి’ చిత్రంతో డీసెంట్ హిట్ కొట్టి ప్లాపుల నుండీ బయటపడిన సాయితేజ్.. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి ‘ప్రతీరోజూ పండగే’ చిత్రాన్ని చేశాడు. హీరోయిన్ రాశీ ఖన్నా ఈ చిత్రంలో ‘టిక్ టాక్ స్టార్’ కామెడీ పండించి.. బాగా ఎంటర్టైన్ చేసింది. ఈ చిత్రం కథ మొత్తం సత్య రాజ్ పాత్ర చుట్టూనే తిరుగినప్పటికీ.. మేజర్ క్రెడిట్ మొత్తం రావు రమేష్ కే దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తన కామెడీ టైమింగ్ తో.. ప్రేక్షకుల కడుపు చెక్కలు చేసేస్తాడనే చెప్పాలి.
ఇక డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం 13 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 10.59 cr |
సీడెడ్ | 3.35 cr |
ఉత్తరాంధ్ర | 3.90 cr |
ఈస్ట్ | 1.76 cr |
వెస్ట్ | 1.36 cr |
కృష్ణా | 1.79 cr |
గుంటూరు | 1.53 cr |
నెల్లూరు | 0.80 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.73 cr |
ఓవర్సీస్ | 2.55 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 29.54 cr (share) |
‘ప్రతీరోజూ పండగే’ చిత్రానికి 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 13 రోజులు పూర్తయ్యేసరికి 29.54 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు 13 వ రోజున ఈ చిత్రం ఏకంగా 2.95 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. న్యూ ఇయర్ సెలవు రోజును ఈ చిత్రం బాగా క్యాష్ చేసుకుందనే చెప్పాలి. ఈ చిత్రం ఇప్పటి వరకూ సాయి తేజ్ కెరీర్ బెస్ట్ అయిన ‘సుప్రీమ్’ కలెక్షన్లను కూడా అధిగమించింది. సంక్రాంతి వరకూ ఈ చిత్రం కలెక్షన్ల జోరు తగ్గేలా లేదనే చెప్పాలి.a
Click Here to Read Prati Roju Pandage Movie Review
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!