మెగా మేనల్లుడు సాయి తేజ్.. అరడజను ప్లాఫుల తర్వాత ‘చిత్రలహరి’ చిత్రంతో బయటపడ్డాడు. ఆ చిత్రంతో డీసెంట్ హిట్ మాత్రమే కొట్టిన తేజు.. ఇప్పుడు ‘ప్రతీరోజూ పండగే’ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. ‘జిఏ2 పిక్చర్స్’ అండ్ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడు మారుతీ డైరెక్ట్ చేసాడు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సత్య రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.
ఇక 18 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 11.86 cr |
సీడెడ్ | 3.79 cr |
ఉత్తరాంధ్ర | 4.55 cr |
ఈస్ట్ | 1.98 cr |
వెస్ట్ | 1.48 cr |
కృష్ణా | 2.01 cr |
గుంటూరు | 1.92 cr |
నెల్లూరు | 0.87 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.81 cr |
ఓవర్సీస్ | 2.58 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 32.85 cr (share) |
‘ప్రతీరోజూ పండగే’ చిత్రానికి 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 18 రోజులు పూర్తయ్యేసరికి 32.85 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 18 వ రోజు అదికూడా సోమవారం అయినప్పటికీ.. ఈ చిత్రం 0.41 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే సాయి తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఫుల్ రన్ పూర్తయ్యేసరికి 35 కోట్ల షేర్ మార్క్ ను దాటే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Click Here to Read Prati Roju Pandage Movie Review
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!