ప్రేమిస్తే హీరోయిన్ సంధ్య ఇలా అయిపోయిందేంటి

2005 లో వచ్చిన ‘ప్రేమిస్తే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంధ్య. ఈమె అసలు పేరు రేవతి అయినప్పటికీ ‘ప్రేమిస్తే'(తమిళ్ లో ‘కాదల్’) చిత్రంతో సంధ్యగా మారింది. శంకర్ శిష్యుడు బాలాజీ శక్తివేల్ ఈ చిత్రానికి దర్శకుడు.ఓ యదార్థ సంఘటనని ఆధారం చేసుకుని ఈ ప్రేమకథను రూపొందించారు. తమిళ్ కంటే తెలుగులో కొంచెం ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ. ఈ చిత్రంలోని ‘ఇతడే’ అనే పాట.. ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది.

మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడంతో సంధ్యకి తమిళ్ తో పాటు కన్నడ,మలయాళం, తెలుగు భాషల్లో కూడా వరుస అవకాశాలు లభించాయి. అన్ని భాషల్లోనూ కలుపుకుని 40కి పైగా చిత్రాల్లో నటించింది సంధ్య. తెలుగులో ఈమె పవన్ కళ్యాణ్ నటించిన ‘అన్నవరం’ సినిమాలో నటించింది. వరలక్ష్మీ అనే అమాయకపు పల్లెటూరి చెల్లెలి పాత్రలో చాలా సహజంగా నటించింది సంధ్య. ఆ తర్వాత హాసిని అనే మూవీలో కూడా నటించింది కానీ..

అది టైం కాని టైంలో రిలీజ్ కావడం వల్ల ఈ మూవీ వచ్చి వెళ్లినట్టు కూడా ప్రేక్షకులకు తెలీదు. 2015 లో చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అర్జున్ ని సంధ్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2016 సెప్టెంబర్‌లో సంధ్య దంపతులకు ఒక పండంటి ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె చెన్నైలో ఉంటుంది.హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోందీ. ఈమె లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఈమె గుర్తుపట్టలేని విధంగా ఉందని చెప్పాలి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus