ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన ‘సలార్’ మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ టికెట్ల కోసం తెలుగు రాష్ట్రాల్లోని జనాలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. టికెట్ రేట్లు ఫైనల్ అవ్వకో ఏమో కానీ ఇప్పటివరకు బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు అనే కామెంట్లు వినిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు.. ప్రభుత్వాలకి మేకర్స్ రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. వాటికి పర్మిషన్ రావడం డిలే అవ్వడం వలనే..
డిసెంబర్ 22 రిలీజ్ కావాల్సిన ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు అని అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అలాగే ‘సలార్’ బుకింగ్స్ ఈరోజు రాత్రి 8 గంటల 24 నిమిషాలకి ఓపెన్ అవుతాయని మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. దీంతో అందరూ లాప్ టాప్..లు ముందేసుకుని కళ్ళు కాయలు కాచేలా ‘సలార్’ బుకింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.
అయితే రిలీజ్ ట్రైలర్ మాదిరి ఇవి కూడా పోస్ట్ పోన్ అయితే వారి రియాక్షన్ ఎలా ఉంటుందో..! సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ టికెట్ రేట్లు ఈ విధంగా ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. ఏపీ లో రూ.40 చొప్పున టికెట్ రేట్లు పెంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఆ రకంగా చూసుకుంటే అక్కడ మల్టీప్లెక్సుల్లో రూ.225 , సింగిల్ స్క్రీన్స్ లో రూ.165 గా ఉండబోతున్నాయి.
సో అక్కడ బెటరే..! అయితే తెలంగాణాలో మాత్రం రూ.65 వరకు టికెట్ రేట్లు పెరగనున్నాయి. ఆ రకంగా చూసుకుంటే మల్టీప్లెక్సుల్లో రూ.413 గా, సింగిల్ స్క్రీన్స్ లో రూ.253 గా టికెట్ రేట్లు ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. ఇవి తెలంగాణా జనాలకి ఫియర్ తెప్పించే హైక్స్ అనే చెప్పాలి. ఇక ఏపీలో 10 రోజులు, తెలంగాణాలో వారం రోజుల పాటు ఈ రేట్లు అమల్లో ఉండబోతున్నాయి అని సమాచారం.