Prithviraj: మలయాళ స్టార్‌ హీరోపై ఫైన్‌ పుకార్లు.. సీరియస్‌ అయిన యాక్టర్‌

కొన్నిసార్లు పుకార్లు, గాసిప్‌ న్యూస్‌ ఎలా పుట్టుకొస్తాయో తెలియదు కానీ.. వింటుంటే నిజమే అనిపించేస్తుంటాయి. దీంతో నమ్మేస్తుంటారు కూడా. వాటిపై తర్వాత ఆ సినిమా తారలు స్పందించి, క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కు సంబంధించిన ఓ వార్త తాజాగా ఇలానే వైరల్‌ అయ్యి.. చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు పృథ్వీరాజ్‌ సుకుమార్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి రూ. 25 కోట్లు ఫైన్‌ కట్టారు అనేది ఆ వార్తల సారాంశం.

విదేశాలకు చెందిన కొందరు వ్యక్తుల నుండి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ డబ్బులు తీసుకుని ప్రచార చిత్రాలు నిర్మిస్తున్నారు అనేది ఆ పుకారు సారాంశం. ఈ విషయంలో విచారణలో తేలడంతో ఆయన ఈడీకి పెద్ద మొత్తంలో ఫైన్‌ చెల్లించారని వార్తలొచ్చాయి. ఈ మేరకు ఓ మలయాళ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ వార్తలు కనిపించాయి. దీంతో పృథ్వీరాజ్‌ ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా ఇలాంటి వార్తలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు.

సరైన సమాచారం లేకుండా వార్తలు రాసే ఇలాంటివారిపై అవసరమైన న్యాయప్రకియను ప్రారంభిస్తానని కూడా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెలిపారు. ‘‘మరునాడన్ మలయాళీ’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ నా పరువుకు భంగం కలిగించేలా వార్తలు వచ్చాయి. అంతేకాదు దీనికిగాను ఈడీకి నేను రూ.25 కోట్ల జరిమానా కట్టానని కూడా ఆ వార్తల్లో చెబుతున్నారు. నాపై అసత్య ప్రచారాలు చేసినందుకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాను’’ అని పృథ్వీరాజ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

తన (Prithviraj) గురించి ఏదైనా సమాచారాన్ని రాసేముందు, చెప్పేముందు చెక్‌ చేసుకోవాలలని కోరుతున్నాను అంటూ ఆ ప్రకటనలో మొత్తం వివరాలు చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్‌. ఇక ఆయన సినిమాల సంగతి చూస్తే.. ప్రభాస్‌తో ‘సలార్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన ‘అయ్యప్పనమ్‌ కోషియం’, ‘బ్రో డాడీ’, ‘లూసిఫర్‌’, ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’, ‘జనగణమన’ వంటి ప్రాజెక్ట్‌లతో మన దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus