Lucifer 3: పృథ్వీరాజ్ సుకుమారన్ ప్లానింగ్ ఊహించలేదు!

Aమోహన్ లాల్ (Mohanlal)  హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో ‘లూసిఫర్’ అనే సినిమా వచ్చింది. మలయాళంలో ఇది ఇండస్ట్రీ హిట్ సినిమా. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ‘బ్రో డాడీ’ అనే సినిమా వచ్చింది. అది కూడా హిట్టే..! ఇప్పుడు ‘లూసిఫర్’ కి సీక్వెల్ గా ‘ఎల్ 2: ఎంపురాన్’ (L2: Empuraan)  వచ్చింది. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగానికి పాజిటివ్ టాక్ రాలేదు. అయినా సరే.. హిట్ సినిమా సీక్వెల్ యావరేజ్ గా ఉన్నా నడిచిపోద్ది అనే నమ్మకాన్ని నిజం చేస్తూ ‘ఎల్ 2: ఎంపురాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

Lucifer 3

ఇక క్లైమాక్స్ లో మూడో భాగం కూడా ఉన్నట్టు రివీల్ చేశారు. అయితే ‘లూసిఫర్ 3’ (Lucifer 3) లో మోహన్ లాల్ హీరో కాదు అనే టాక్ ఇప్పుడు షురూ అయ్యింది. ఎందుకంటే యంగ్ స్టీఫెన్ గా మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ ని చూపించారు. దీంతో దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కొత్తగా ప్లాన్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మోహన్ లాల్ ని మరింత యంగ్ గా చూపించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టం.

డీ ఏజింగ్ వంటి టెక్నిక్ వాడినా.. అది నేచురల్ గా ఉండదు. పైగా ఈ మధ్య డీ ఏజింగ్ టెక్నిక్ వాడిన సినిమాలు అన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ‘ఆచార్య’  (Acharya) ‘ది గోట్’ (The GOAT) ‘విడుదలై 2’ (Vidudala Part 2) వంటి సినిమాల్లో హీరోలకి ఈ టెక్నిక్ వాడారు. ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు. అలా చూసుకుంటే పృథ్వీరాజ్ సుకుమారన్ తెలివైన నిర్ణయమే తీసుకున్నాడు అని స్పష్టమవుతుంది.

అయితే ‘టిల్లు’.. లేదంటే ‘జాక్’.. ఇదేనా సిద్ధు ప్లాన్‌?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus