నందమూరి బాలకృష్ణను ఇప్పటివరకు ఎవరూ చూపించని విధంగా చూపిస్తా అంటూ ఈ మధ్య సినిమా గురించి హైప్ పెంచేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా తర్వాత అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఉంటుందనే విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా ప్లాట్‌ను కూడా అనిల్ రావిపూడి చెప్పేశారు. దీంతో సినిమా గురించి ఆలోచనలు, అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో మరో పుకారు ఒకటి బయటికొచ్చింది.
ఈ సినిమాలో బాలయ్య 45 – 50 ఏళ్ల మధ్యవయస్కుడిగా కనిపిస్తాడని అనిల్ రావిపూడి చెప్పేశారు. అంతేకాదు ఇందులో యువ కథానాయిక శ్రీలీల బాలయ్యకు కూతురిగా నటిస్తుందని కూడా చెప్పేశారు. మరి ఆమెకు తల్లి పాత్ర ఎవరు? అనే ప్రశ్న కచ్చితంగా వినిపిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం ప్రియమణి అని వినిపిస్తోంది. ‘మిత్రుడు’ సినిమాలో ఈ ఇద్దరు నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఫలితం బాగోకున్నా, సినిమాలో జోడీకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
అప్పటికే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ను ఇప్పుడు క్యాష్ చేసుకోవాలని అనిల్ రావిపూడి అనుకుంటున్నారని సమాచారం. మరోవైపు బాలయ్యకు హీరోయిన్‌గా.. అందులోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్ర అంటే నాయికలు దొరకడం అంత ఈజీ కాదు. ఏదో గ్లామర్ రోల్ అంటే కొత్తమ్మాయిని చూడొచ్చు. నటనకు ప్రాధాన్యమనేసరికి కాస్త సీనియర్ అయి ఉండాలి. అందులోనూ 20 ఏళ్ల అమ్మాయికి తల్లిగా నటించాలి అంటే అందరూ ముందుకు రాకపోవచ్చు.
ప్రియమణి అయితే అలాంటి పాత్రకు సరిగ్గా కుదురుతుందని, ‘నారప్ప’లో అలాంటి పాత్రే చేసింది కాబట్టి ఆమె అయితే ఓకే అని అనుకుంటున్నారట. ఇప్పటికే సినిమా ఆలోచన ఆమె దగ్గర చెబితే… ప్రాథమికంగా ఓకే చెప్పారని కూడా సమాచారం. త్వరలో పూర్తిస్థాయి కథ చెప్పిన డీల్ లాక్ చేస్తారని సమాచారం. బాలయ్యకు హీరోయిన్ ఓకే అయిపోతే, అల్లుడి పాత్ర కోసం కుర్ర హీరోను చూడాలి. ఎందుకంటే కూతురి పాత్రకు కుర్ర హీరో కావాలిగా. దాని కోసం కుర్ర హీరోలను వెతికే పనిలో ఉన్నారు.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!