Priyanka Chopra: తొలిసారి కుమార్తె ముఖాన్ని చూపించిన ప్రియాంక చోప్రా.. వైరల్ అవుతున్న ఫోటోలు..

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా – హాలీవుడ్ సింగ‌ర్ నిక్ జొనాస్ త‌మ గారాల ప‌ట్టిని మొద‌టిసారి ప్ర‌పంచానికి చూపించారు. ఇన్నాళ్లూ పిక్స్‌లో పాప ముఖాన్ని దాచిపెట్టిన ప్రియాంక తాజాగా చిన్నారి మాల్తి మ‌రియెస్ ఫోటోల‌ను షేర్ చేసింది. ప్రియాంక‌, నిక్‌ ఇంత‌కుముందు సోష‌ల్‌మీడియాలో త‌మ బిడ్డ ఫొటోలు చాలా పోస్ట్ చేశారు. కానీ, వాటిలో పాప ముఖం క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ఈ నెల 15న మాల్తి మొద‌టి పుట్టిన రోజు జ‌రిగింది.

ఈ సందర్భంగా ఏడాది త‌ర్వాత మాల్తి ముఖాన్ని రివీల్ చేయడం విశేషం. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ జొనాస్ సోద‌రుల‌కు సోమ‌వారం (జనవరి 30) స్టార్ అవార్డు ప్ర‌దానం చేసింది. ఈ వేడుక‌ల‌కు ప్రియాంక కూతురు మాల్తితో క‌లిసి హాజ‌రైంది. కూతురిని ఒడిలో కూర్చొబెట్టుకున్న ప్రియాంక‌ పిక్స్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తెల్ల‌ని దుస్తుల్లో, ముద్దులొలికిస్తున్న చిన్నారి మాల్తి భలే క్యూట్‌గా ఉంది.

అమెరికా సింగ‌ర్, న‌టుడు నిక్ జొనాస్, ప్రియాంకా చోప్రాను 2018 డిసెంబ‌ర్ 1న పెళ్లాడాడు. 2022 జ‌న‌వ‌రి 15న త‌ల్లిదండ్రుల‌యిన ఈ జంట.. స‌రోగ‌సీ ద్వారా బిడ్డ‌ను క‌న్నారు. ఏడాది తర్వాత పాప ఫేస్ చూపించడంతో ప్రస్తుతం మాల్తి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus