Priyanka Chopra: హాలీవుడ్ మీడియాపై ప్రియాంక చోప్రా ఫైర్!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా.. నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న తరువాత హాలీవుడ్ కి మకాం మార్చింది. అక్కడే సినిమాలు చేస్తూ.. నటిగా బిజీగా మారింది. హాలీవుడ్ సినిమాల మీద మాత్రమే ఆమె దృష్టి పెట్టింది. ప్రస్తుతం ‘ది మ్యాట్రిక్స్ రిజరెక్షన్’ అనే సినిమాలో నటిస్తోంది. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది.

అయితే రీసెంట్ గా జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొంది ప్రియాంక చోప్రా. దీని గురించి మీడియాలో వార్తలు ప్రచురించారు. ఈ క్రమంలో మీడియా ఆమెని ‘వైఫ్ ఆఫ్ నిక్’ అని పిలుస్తూ వార్తలు రాసింది. ఈ విషయం ప్రియాంకకు అసలు నచ్చలేదు. దీంతో మీడియాపై ఫైర్ అయింది. ”నేను ఎంతో పాపులర్ ఫ్రాంచైజీలో నటిస్తూ దాన్ని ప్రమోట్ చేస్తున్నాను. అయినా కూడా నన్ను ‘ది వైఫ్ ఆఫ్..’ అంటూ ప్రస్తావిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు” అంటూ మండిపడింది.

ఈ విషయాన్ని మహిళల సమస్యకు కనెక్ట్ చేస్తూ.. మాట్లాడింది. ”మహిళల విషయంలోనే ఇలా జరుగుతుంది. వాళ్లు ఎంత కష్టపడినా.. ఫలానా కూతురు, ఫలానా వారి భార్య అనే చెప్తారు. ఇలా అయితే ఎలా..? ఈ పద్దతి మారకపోతే మహిళల పురోగతి ఎప్పటికి సాధ్యపడుతుంది” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. తన భర్తపై ఎంతో ప్రేమ కురిపిస్తుంటుంది ప్రియాంక. ఒక్కోసారి పబ్లిక్ లో కూడా భర్తతో రొమాన్స్ చేస్తూ కనిపించింది.

అంతలా ఉండే ప్రియాంకను వైఫ్ ఆఫ్ నిక్ అని పిలిస్తే వచ్చిన నష్టమేంటంటూ.. కొందరు సోషల్ మీడియా వేదికగా ఆమెని ప్రశ్నిస్తున్నారు. కొందరేమో ఆమెని తనకి తానుగా గుర్తించకపోవడం కోపం తెప్పించిందని కామెంట్స్ చేస్తున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus