Priyanka Chopra, Nick Jonas: పుట్టబోయే పిల్లల కోసం నిక్యాంక ఏం చేశారంటే?

నిక్యాంక అదేనండీ… ప్రియాంక చోప్రా, నిక్‌ జొనాస్‌ జంట ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సరోగసీ ద్వారా ఆ బిడ్డ జన్మించినట్లు తెలిపారు కూడా. అయితే తమ బిడ్డల కోసం ఈ జంట ఇప్పటికే సుమారు ₹150 కోటు ఖర్చు పెట్టి తమ ఇంటిని సిద్ధం చేసుకున్నారని తెలుసా? అవును హాలీవుడ్‌ మీడియాలో ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. ఇప్పుడు కాదు సుమారు మూడేళ్ల క్రితమే నిక్యాంక ఈ పని చేశారట.

ప్రియాంకకు పాప పుట్టింది అంటూ… ఆమె సోదరి మీరా చోప్రా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో అందరూ ప్రియాంక- నిక్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ల ఇంటి గురించి వస్తున్న వార్తలు విని అవాక్కవుతున్నారు. అమెరికాకు చెందిన పీపుల్స్‌ మ్యాగజైన్‌ ఇటీవల ప్రియాంక- నిక్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ గురించి ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 2018లో ప్రియాంక చోప్రా – నిక్‌ జొనాస్‌ ఒకటైన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఏడాదే అంటే 2019లోనే అమెరికాలోని లాస్‌ ఏంజిలెస్‌లో సెటిల్‌ అయ్యారు. అప్పుడే పుట్టబోయే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఎన్‌సినో ఎస్టేట్స్‌ని కొనుగోలు చేశారట. దాని విలువ 20 మిలియన్ల డాలర్లు. అంటే మన కరెన్సీ ప్రకారం ₹149 కోట్లు అన్నమాట. అంతేకాదు ఈ ఇంటి కోసం ఆ దంపతులు మూడు నెలలు కష్టపడి అన్నీ తమకు నచ్చినట్లు సిద్ధం చేసుకున్నారట. ఇంటి కోసం ఇంత భారీగా ఖర్చు చేయడం వెనుక బలమైన కారణం ఉందట.

పిల్లలతో గడిపే ప్రతీ క్షణం అమూల్యమైనదిగా ఉండాలని భావించి.. అన్నీ ఆలోచించి ఇల్లు కొనుగోలు చేశారంట. ఆ తర్వాత తమ అభిరుచులకు తగ్గట్టుగా అందులో మార్పులు చేసుకున్నారట. అవుట్‌డోర్‌ స్పేస్‌, చుట్టూ అట్మాస్పియర్‌లో ఎక్కువగా పచ్చదనం ఉండేలా చూసుకున్నారట. అందుకే అంత ఖర్చు అయ్యిందని టాక్‌. అన్నట్లు మొన్నీమధ్య దీపావళి రోజు ప్రియాంక షేర్‌ చేసిన ఫొటోల్లో ఉన్న ఇల్లు అదే. అందులో ఆ ఇంటి ప్రత్యేకతలు కొన్ని మనం చూడొచ్చు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus