Priyanka Chopra: సీక్రెట్ గా తల్లి అయిన ప్రియాంక చోప్రా.. సర్‌ప్రైజ్ న్యూస్!

ప్రియాంక చోప్రా జోనాస్ – నిక్ జోనాస్ శనివారం ఒక సంచలన ప్రకటన చేశారు. తల్లిదండ్రులు అయినట్లుగా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని చెప్పడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఇంత హఠాత్తుగా ప్రియాంక తల్లి ఎప్పుడు అయ్యిందని చాలామందిలో అనుమానం కలగవచ్చు. ఇక వీరు ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ ను ఫాలో అయినట్లుగా క్లారిటీ ఇచ్చారు. సరోగసీ ద్వారా ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రెటీలు వారి వారసులకు జన్మనిస్తున్నారు.

ఇక వీరి మొదటి బిడ్డ రాకను కూడా అదే తరహాలో ప్రకటించారు. ఈ జంట సోషల్ మీడియా ఖాతాలలో ఈ సంతోషకరమైన ప్రకటన చేసారు. “మేము సర్రోగేట్ ద్వారా బిడ్డను స్వాగతించామని ధృవీకరించినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ ప్రత్యేక సమయంలో మా కుటుంబంపై ఫోకస్ ఉన్నందున మేము గౌరవంగా ప్రైవసీ కావాలని కోరుకుంటున్నాము.. అని నిక్, ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో వివరణ ఇచ్చారు. అయితే జన్మించింది అమ్మాయా, అబ్బాయా అనే విషయంలో ప్రియాంక, నిక్ ఇంకా సరైన క్లారిటీ ఇవ్వలేదు.

కానీ ఒక అమెరికన్ వెబ్‌ సైట్ కథనం ప్రకారం వీరికి ఆడపిల్ల జన్మించినట్లుగా తెలుస్తోంది. దక్షిణ కాలిఫోర్నియా ఆసుపత్రిలో శనివారం శిశువు జన్మించినట్లు సమాచారం. ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ నుండి తన ఇంటిపేరును, అలాగే ఆమె భర్త ఇంటిపేరును తొలగించిన తర్వాత వారి మధ్య సంబంధాలు సరిగ్గా లేవని ఊహాగానాలు చాలానే వచ్చాయి. అంతే కాకుండా విడాకులు తీసుకుంటున్నట్లుగా కూడా సిద్ధంగా ఉన్నారని కథనాలు వెలువడ్డాయి. ఇటీవల కాలంలో చాలామంది సెలెబ్రెటీలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అందులో ప్రియాంక, నిక్ జంట కూడా ఉందని చెప్పడంతో నిజమని అనుకున్నారు.

కానీ ఇప్పుడు ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వారి మొదటి బిడ్డకు సంబంధించిన విషయాన్ని చెప్పడంతో వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ జంట వారి కొత్త తరహా ఫ్యామిలీ లైఫ్ ను స్టార్ట్ చేయనున్నట్లు అర్ధమవుతోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus