Priyanka Chopra: నాకిచ్చే డైలాగ్స్ చెత్తగా ఉండేవి.. ప్రియాంక షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటీమణులలో ప్రియాంక చోప్రా ఒకరు కాగా ఈ నటికి ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు అంతాఇంతా కాదు. ప్రియాంక చోప్రా ఏ విషయం గురించి మాట్లాడినా కొన్నిసార్లు బోల్డ్ గా మాట్లాడతారనే సంగతి తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రా ఒక సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సినిమా పేరు మాత్రం తాను చెప్పనని కానీ ఆ మూవీ ద్వారా ఎదురైన అనుభవం మాత్రం పరమ చెత్త అని ప్రియాంక చోప్రా కామెంట్లు చేశారు.

ఆ సినిమాలో నటిస్తున్న సమయంలో అసహ్యమేసిందని ఆమె వెల్లడించారు. ఆ సినిమాలోని నా సన్నివేశాల కోసం సెట్స్ లో గంటల తరబడి నేను ఎదురుచూశానని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు. అంత సమయం పాటు ఎదురు చూస్తే నాకిచ్చిన డైలాగ్స్ చెత్తగా ఉన్నాయని ఆమె అన్నారు. ఆ సినిమాలో ఉన్న డైలాగ్స్ అన్నీ చెత్తగా ఉన్నాయని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.ఆ డైలాగ్స్ అన్నీ అస్సలు సెన్స్ లేని డైలాగ్స్ అని ప్రియాంక చోప్రా వెల్లడించడం గమనార్హం.

ఆ సినిమా షూట్ సమయంలో నేను ఒక ఆడబొమ్మలా కూర్చునేదానినని (Priyanka Chopra) ఆమె చెప్పుకొచ్చారు. వాస్తవానికి నేను ఆ టైప్ కాదని ప్రియాంక చోప్రా కామెంట్లు చేయడం గమనార్హం. ఈ రీజన్ వల్లే ఆ సినిమా నాకు నచ్చదని ప్రియాంక చోప్రా తెలిపారు. నాకు పరోటాలు అంటే ఎంతో ఇష్టమని పరోటాలను నేను ఎంతో ఇష్టంగా తింటానని ఆమె కామెంట్లు చేశారు.

ఎవరైనా నాకు ఫోన్ చేసిన సమయంలో వచ్చేస్తున్నా, దారిలోనే ఉన్నా అని చెబితే నమ్మవద్దని అలా చెప్పానంటే నేను అబద్ధం చెప్పానని అర్థం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. అద్దంలో మొహం చూసుకోవడం నాకు ఇష్టమని స్పూన్ లో కూడా మొహం చూసుకుంటానని ప్రియాంక చోప్రా అన్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus