బిగ్ బాస్ 9వ వారం నామినేషన్స్ లోకి వచ్చిన హౌస్ మేట్స్ కి ఒక టాస్క్ ఇచ్చాడు. జీవితమే ఒక ఆట అనే ఈ టాస్క్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్లకి ఈవారం ఇమ్యూనిటీ లభిస్తుంది. ఇందులో 10మంది ఇంటిసభ్యులు పాల్గొన్నారు. కెప్టెన్ అయిన షణ్ముక్ సంచాలక్ గా వ్యవహరించాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న సేఫ్ జోన్ లోకి తమ బ్యాగ్స్ కాకుండా వేరే ఇంటిసభ్యుల బ్యాగ్స్ ని తీస్కుని వెళ్లాలి. ఎవరైతే ఆలస్యంగా వెళ్తారో వాళ్లతో పాటుగా, వాళ్లు పట్టుకున్న బ్యాగ్ ఎవరిదైతే వాళ్లు కూడా డేంజర్ జోన్ లోకి వస్తారు.
ఇక్కడే ఒక్కో హౌస్ మేట్ మైండ్ గేమ్ ఆడటం అనేది స్టార్ట్ చేసారు. పింకీ మానస్ బ్యాగ్ ని తీస్కుని పరిగెత్తేందుకు ప్రయత్నించింది. ఇక్కడే కెప్టెన్ అండ్ సంచాలక్ అయిన షణ్ముక్ జస్వంత్ ట్విస్ట్ ఇచ్చాడు. సెకండ్ రౌండ్ లో బ్యాగ్స్ ఈజీగా రాకుండా బ్యాగ్స్ రూమ్ లోకి వెళ్లి వాటిని ముళ్లు వేసేశాడు. దీంతో షాకైన హౌస్ మేట్స్ ముడులు ఇప్పే టైమ్ లేక రెండు రెండు బ్యాగ్స్ ని తీస్కుని మరీ పరిగెత్తేశారు. 5 రౌండ్స్ బాగానే గడిచాయి. అయితే, ఆరోరౌండ్ లో పింకీ బ్యాగ్ ని పట్టుకోలేకపోయింది.
గేమ్ నుంచి డిస్ క్వాలిఫై అయ్యింది. ఇది సంచాలక్ షణ్ముక్ ప్రకటించేసరికి, అసలు నిన్ను బ్యాగ్స్ ముడి ఎవరు వేయమన్నారు అంటూ ఆర్గ్యూమెంట్ కి దిగింది. కిచెన్ లో కి విసురుగా వచ్చి రుసరుసలాడింది. షణ్ముక్ ని నిలదీసే ప్రయత్నం చేసింది. నేను తప్పుగా చేసి ఉంటే బిగ్ బాస్ పిలిచి వార్నింగ్ ఇచ్చేవాడు పింకీ అంటూ మాట్లాడాడు షణ్ముక్. నీ అంత బుర్ర నాకు లేదు అన్నా అంటూ షణ్ముక్ ని కడిగేసింది పింకీ. నేను తప్పుగా చేసి ఉంటే ఇప్పుడు స్టోర్ రూమ్ ఓపెన్ అవ్వదు చూడూ అంటూ మాట్లాడాడు షణ్ముక్.
కానీ స్టోర్ రూమ్ ఓపెన్ అయ్యింది పింకీ గేమ్ నుంచి డిస్ క్వాలిఫై అయ్యింది. ఇంతకీ షణ్ముక్ చేసింది కరెక్ట్ పనేనా.. టాస్క్ లో లేకుండా ఇలా సంచాలక్ సొంతంగా చేయచ్చా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాఫీగా సాగిపోయే గేమ్ లో చిక్కుముళ్లు వేసి సంచాలక్ షణ్ముక్ తప్పుచేశాడా అనేది ఆసక్తికరమైన టాపిక్ గా మారింది. అదీ విషయం.