Priyanka Jawalkar: ‘తిమ్మరుసు’ హిట్ తో మంచి జోష్ లో ఉన్న ప్రియాంక జవాల్కర్

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్ ఇప్పుడు ‘తిమ్మరుసు’ అనే మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో ప్రియాంక జవాల్కర్… లాయర్ అను పాత్రలో నటించింది.’తిమ్మరుసు’ లో ప్రియాంక ఓ పక్క అందంగా కనిపిస్తూనే, తన పాత్రకి తగ్గట్టు మంచి పర్మార్మెన్స్ కూడా ఇచ్చిందని ప్రశంసిస్తున్నారు ప్రేక్షకులు. టీం సభ్యులు కూడా అదే విధంగా ప్రశంసిస్తుండడం విశేషం. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకున్న ప్రియాంక.. ‘తిమ్మరుసు’ హిట్ తో టాలీవుడ్ లో మరింత ఉత్సాహంతో దూసుకుపోయేలా కనిపిస్తోంది.

ఆగస్టు 6న ప్రియాంక జవాల్కర్ నటించిన మరో మూవీ ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమా ష్యూర్ షాట్ హిట్ అనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తోంది.ఎందుకంటే టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ అన్నీ అదిరిపోయాయి. దీంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఈ సుందరి దక్కించుకున్నట్లే అని అంతా అంటున్నారు.’టాక్సీవాలా’ తోనే తన గ్లామర్, పర్మార్మెన్స్ తో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ‘తిమ్మరుసు’ హిట్ తో మరో మెట్టు పైకి ఎక్కినట్టే.! ఈ అమ్మడి పై ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోలు, దర్శక నిర్మాతల దృష్టి పడింది.చెప్పాలంటే ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయిందనే చెప్పాలి.

ఈ మధ్యన మరింత బరువు తగ్గి సన్నబడిన ప్రియాంక జవాల్కర్ ఇప్పుడు మరింత అందంగా, అట్రాక్టివ్ గా కనిపిస్తూ టాలీవుడ్ ను ఆకర్షిస్తోంది. ‘గమనం’ అనే మరో మూవీలో కూడా ఈమె నటిస్తుంది.అది కూడా విడుదలకు ముస్తాబవుతోంది.నటనకి ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్న ప్రియాంక జవాల్కర్….. నాని, శర్వానంద్ లాంటి నెక్స్ట్ లెవెల్ హీరోలతో కూడా నటిస్తాను అనే కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తుంది.ట్యాలెంట్, గ్లామర్, హార్డ్ వర్కింగ్ కలిగిన హీరోయిన్లు టాలీవుడ్లో స్టార్లుగా ఎదిగారు. ఆ రకంగా చూసుకుంటే ప్రియాంక జవాల్కర్ కచ్చితంగా స్టార్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

1

2

3

4

More..
1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15


Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus