Bigg Boss 5 Telugu: టాస్క్ లో ఇద్దరూ ఎందుకు గొడవ పడ్డారు..?

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ స్టార్ట్ అయ్యింది. ఇందులో భాగంగా బిగ్ బాస్ సూపర్ హీరోస్ ఇంకా సూపర్ విలన్స్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇక్కడ విలన్స్ గ్రూప్ లో రవి, విశ్వ , సన్నీ, సిరి, అనీమాస్టర్ ఇంకా జెస్సీలు ఉంటే హీరోస్ గ్రూప్ లో మానస్, షన్నూ, పింకీ, కాజల్, శ్రీరామ్ లు ఉన్నారు. ఇక్కడే ప్లాస్మాలో ఎవరి టీమ్ పేరు వస్తుందో వారు వేరే టీమ్ నుంచీ ఒకరిని సెలక్ట్ చేస్కుని వారికి కొన్ని ఛాలెంజస్ ఇవ్వాలి. వాటిని టీమ్ మెంబర్ ఎవరైనా చేయలేకపోతే ఐ క్విట్ అని అనొచ్చు.

అంతేకాదు, ప్రతి రౌండ్ కి థండర్ లాకర్ ఓపెన్ చేసే కీస్ ని బిగ్ బాస్ పంపిస్తాడు. అందులో ధంరడ్ లాక్ ని ఓపెన్ చేస్తూ దాన్ని స్టోర్ రూమ్ లో పెట్టాలి. ఇక్కడే ఫస్ట్ పింకీ ఇంకా విశ్వ ఇద్దరికీ గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది. పింకీ ని తోసుకుంటూ వెళ్లిన విశ్వ స్టోర్ రూమ్ లో తాళం చెవిని తీస్కుని వచ్చి ధండర్ లాకర్ ని ఓపెన్ చేసి తిరిగి స్టోర్ రూమ్ లో పెట్టాడు. ఫిజికల్ గేమ్ ఆడితే నేను కూడా ఫిజికల్ అవుతాను అంటూ ఇక్కడ పింకీ విశ్వపై ఫుల్ ఫైర్ అయ్యింది.

ఫస్ట్ నుంచీ కూడా విశ్వ నన్ను టార్గెట్ చేస్తున్నాడు అంటూ మాట్లాడింది. ఫిజికల్ ఎవరైనా గేమ్ లో అయితే నేను దాని అమ్మ మొగుడు అవుతా అంటూ నోరుజారింది. దీంతో విశ్వ పింకీతో ఆర్గ్యూమెంట్ కి దిగాడు. ఎవర్ని అంటున్నావ్ అంటూ రవి పింకీని నిలదీశాడు. కేవలం నేను ఫిజికల్ అమ్మ మొగుడు అన్నానే తప్పా, ఎవర్నీ కాదని ఎక్స్ ప్లనేషన్ ఇచ్చింది పింకీ. విశ్వ ఈ మాట అన్నతర్వాత టాస్క్ లో ఇంకా ఫైర్ అయ్యి ఆడాడు. తర్వాత రౌండ్ లో కూడా పింకీని డామినేట్ చేస్కుంటూ వెళ్లి స్టోర్ రూమ్ లో లాక్ ని పెట్టాడు విశ్వ. అదీ మేటర్.

[yop_poll id=”5″]

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus