ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అలాగే ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు, పి.ఆర్.ఓ అయిన మహేష్ ఎస్ కోనేరు ఈరోజు గుండెపోటుతో మరణించడం అందరినీ విషాద ఛాయల్లోకి నెట్టేసింది. వైజాగ్ లో ఆయన ఇంట్లోనే మహేష్ మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈయన మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలకు అలాగే కళ్యాణ్ రామ్ సినిమాలకు సంబంధించిన యాక్టివిటీస్ ని మోనిటర్ చేస్తుంటారు. అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘నా నువ్వే’ ‘118’ చిత్రాల ద్వారా నిర్మాతగా కూడా మారారు.
‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ ను స్థాపించి ఆయన ‘నా నువ్వే’ ‘118’ ‘మిస్ ఇండియా’ ‘తిమ్మరుసు’ వంటి చిత్రాలను నిర్మించారు.సత్యదేవ్ హీరోగా నటించిన ‘తిమ్మరుసు’ చిత్రం సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత రిలీజ్ అయ్యి మంచి రిజల్ట్ నే సంపాదించుకుంది. అంతేకాకుండా ఇలయదలపతి విజయ్ హీరోగా నటించిన ‘మెర్సెల్'(తెలుగులో ‘అదిరింది’) ‘బిగిల్’ (తెలుగులో ‘విజిల్’), ‘మాస్టర్’ వంటి చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. ఎన్టీఆర్- సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం నుండీ ఎన్టీఆర్ వద్ద పి.ఆర్.ఓ పనిచేస్తూ వచ్చారు మహేష్ కోనేరు.
మెల్ల మెల్లగా నిర్మాణం వైపు అడుగులు వేశారు. దిల్ రాజుకి కూడా ఇతను అత్యంత సన్నిహితుడు.ఇక మహేష్ కోనేరు మరణవార్త తెలిసిన ఎన్టీఆర్.. ‘నాకు మాటలు రావడం లేదు.. హృదయం బరువెక్కిపోయింది’ అంటూ ట్వీట్ చేసాడు.
With the heaviest of heart and in utter disbelief, I am letting you all know that my dearest friend @SMKoneru is no more. I am shell shocked and utterly speechless.