ఒక రెండు రోజులుగా మంచు విష్ణు “ఓటర్” సినిమా విషయంలో జరుగుతున్న రచ్చను చూస్తూనే ఉన్నాం. నిజానికి ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల చేద్దామనుకున్న ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ షూటింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత కూడా రిలీజ్ కి నోచుకోలేకపోయింది. ఆ సినిమా అంటూ ఒకటుందని ప్రేక్షకులు కూడా ఎప్పుడో మర్చిపోయారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకోవడంతో ఇటీవల ఆ సినిమా టీజర్ ను విడుదల చేసి త్వరలోనే విడుదల అని హడావుడి చేశారు.
అయితే.. సినిమా విడుదల అటుంచితే, సినిమా విషయంలో జరుగుతున్న వింత సంఘటనలు మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఈ కథ మోహన్ బాబు సూపర్ హిట్ సినిమా “అసెంబ్లీ రౌడీ”కి కాపీ అని, అందుకోసం దర్శకుడు కార్తీక్ తప్పకుండా రాయల్టీ పే చేయాలని విష్ణు తనను ఇబ్బంది పెడుతున్నాడని దర్శకుడు కార్తీక్ రెడ్డి కేస్ కంప్లైంట్ ఇవ్వగా దానికి విష్ణు అండ్ టీం కేస్ ఫైల్ చేశారు. ఈ గొడవ ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. కొత్త మనుషులు, కొత్త కేసులు ఇందులో ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నారు. అసలు ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేని ఈ సినిమా విషయంలో ఇంత రచ్చ ఎందుకో ఎవరికీ అర్ధం కావడం లేదు.