Dil Raju: ఆ ట్రోల్స్ గురించి రియాక్ట్ అయిన దిల్ రాజు.. అవి చంపలేవంటూ?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ట్రోల్స్ ను ఎదుర్కొంటూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు కాగా రెండో పెళ్లి విషయంలో ఆయనపై కొంతమంది ట్రోల్స్ చేశారు. అప్పుడు ట్రోల్స్ చేసిన వాళ్లే ఇప్పుడు దిల్ రాజు దంపతులను మెచ్చుకుంటున్నారు. దిల్ రాజు భార్య తేజస్విని ఒక సందర్భంలో తాను దిల్ రాజును (Dil Raju) జాను అని పిలుస్తానని చెప్పుకొచ్చారు.

దిల్ రాజు మాట్లాడుతూ నాపై మీమ్స్ వచ్చాయనే విషయం నాకు కూడా అవగాహన లేదని అన్నారు. ఒక ఇంటర్వ్యూలో నేను నా పెళ్లి గురించి ప్రస్తావించానని ఆయన తెలిపారు. ఆ వీడియోను మస్తుగా చూపించారని ఆయన కామెంట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలలో నన్ను గుర్తు పట్టేవాళ్లు కోటి మంది ఉంటారని నాపై కామెంట్లు పెట్టిన వాళ్లు 10,000 మంది ఉంటారని దిల్ రాజు వెల్లడించారు.

నేను కామెంట్లు పెట్టిన వాళ్ల గురించి ఆలోచిస్తే మిగతా వాళ్లకు దూరమవుతానని ఆయన చెప్పుకొచ్చారు. మనం నెగిటివ్ వైబ్ లో బ్రతుకుతున్నామని ఇంట్లో కూడా అలానే ఉంటున్నామని దిల్ రాజు పేర్కొన్నారు. అలా మనకు తెలియకుండానే హెల్త్ పాడు చేసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఆ నెగిటివ్ ను మన దగ్గరకు రాకుండా జాగ్రత్త పడాలని దిల్ రాజు పేర్కొన్నారు.

అవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అని అవేమైనా నన్ను చంపేస్తాయా చంపలేవుగా అని ఆయన కామెంట్లు చేశారు. దిల్ రాజు చెప్పిన విషయాలు నిజమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దిల్ రాజు రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తుండగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం అదరగొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దిల్ రాజు సినిమాలు రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ అవుతూ మంచి లాభాలను అందుకుంటున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus