సినీ పరిశ్రమలో విషాదం.. నిర్మాత కన్నుమూత!

సినీ పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏడాది చివర్లో ‘హిట్ 3’ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టాలీవుడ్ దర్శకురాలు అపర్ణ మల్లాది కూడా గుండెపోటుతో మరణించడం జరిగింది. అప్పటి నుండీ ఇక బ్యాడ్ న్యూస్..లు వింటూనే ఉన్నాం. వయోభారంతో బాధపడుతున్న సీనియర్ నటులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న వాళ్ళు ఇలా ఎవరో ఒకరు మరణిస్తున్నారు. ఇక కొంతమంది యువ నటీనటులు రోడ్డు ప్రమాదాల్లో లేదు అంటే ఆత్మహత్య చేసుకుని మరణించడం జరుగుతోంది.

Mano Akkineni

ఇక నిన్న సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే నటుడు యోగేష్ మహాజన్ కూడా కన్నుమూశారు. ఈ విషాదాల నుండి ఇంకా కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళ నిర్మాత మనో అక్కినేని మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలుస్తోంది. చెన్నైలోని ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఆమె చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు అని తెలుస్తుంది.

ఈమె స్టార్ డైరెక్టర్ సుధా కొంగరకి మంచి స్నేహితురాలు. ఆమె తొలి చిత్రం ‘ద్రోహి’ ని మనో నిర్మించారు. తర్వాత అజిత్ ‘కిరీడం’ , మాధవన్ నటించిన ’13B’ వంటి సినిమాలను కూడా మనో నిర్మించారు. ఇక మనో మరణంపై స్పందించిన సుధా కొంగర.. ఎమోషనల్ పోస్టు పెట్టింది. వీరు కలిసి దిగిన ఫోటో కూడా షేర్ చేసి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరింది.

టాలీవుడ్ టాప్ 5 ఫుట్ ఫాల్స్.. ఇది పుష్ప రాజ్ అరాచకం!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus