ఈరోజు ‘రాబిన్ హుడ్’ (Robinhood) ప్రమోషన్స్ లో భాగంగా మరో ప్రెస్మీట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో హీరో నితిన్ (Nithiin), దర్శకుడు వెంకీ కుడుములతో (Venky Kudumula) పాటు నిర్మాత మైత్రి రవిశంకర్ (Y .Ravi Shankar) కూడా పాల్గొన్నారు. మీడియా వారు అడిగే ప్రశ్నలకి తమ శైలిలో వీరు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో నిర్మాత ‘మైత్రి’ రవికి ఒక ప్రశ్న ఎదురైంది. ‘కంటెంట్ పై ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా..! ప్రీమియర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?’ అని ఓ రిపోర్టర్ మైత్రి రవిని ప్రశ్నించడం జరిగింది.
అందుకు ఆయన.. ” 27 నైట్ కి 28 మార్నింగ్ కి పెద్ద తేడా ఏముంది? ప్రీమియర్స్ ఆలోచన మా మైండ్లో లేదు. ఎందుకంటే లాస్ట్ టైం ప్రీమియర్స్ వేశాం.ఆ టైంలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. అందుకే ప్రీమియర్స్ అనేవి మాకు కలిసి రాలేదు అనిపిస్తుంది” అంటూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు రవి శంకర్. మైత్రి రవి శంకర్ (Ravi Shankar) ఆన్సర్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. గత ఏడాది డిసెంబర్లో ‘పుష్ప 2’ (Pushpa 2) ప్రీమియర్స్ వేశారు.’
ఆ టైంలో అల్లు అర్జున్ (Allu Arjun) సంధ్య థియేటర్ కి వెళ్లడం, తొక్కిసలాట జరగడం .. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కొడుకు శ్రీతేజ్ కూడా హాస్పిటల్ పాలవ్వడం జరిగింది. దీంతో అల్లు అర్జున్ పై కేసు నమోదయ్యి జైలుకు వెళ్లే వరకు వచ్చింది పరిస్థితి. ఆ సినిమా హిట్ అయినా మేకర్స్.. మనస్ఫూర్తిగా ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయారు. అందుకే రవి శంకర్ అలా అన్నారు అని అర్థం చేసుకోవచ్చు.