టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన విశాల్ ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. మార్క్ ఆంటోని సినిమాతో విశాల్ తాజాగా మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగుతో పోల్చి చూస్తే తమిళంలో ఊహించని స్థాయిలో హిట్ అయింది. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత విశాల్ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో మూడు, నాలుగు కోట్ల రూపాయలతో సినిమా తీయడానికి ఎవరూ రావద్దని విశాల్ కామెంట్లు చేశారు.
ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో ఎనక్కు ఎండే కిడైయాదు మూవీ ప్రొడ్యూసర్ కార్తీక్ వెంకట్రామన్ మాట్లాడుతూ ఇదో రకం సనాతన ధర్మం అ ని చెప్పుకొచ్చారు. ఈ నెల 6వ తేదీన ఎనక్కు ఎండే కిడైయాదు రిలీజ్ కానుండగా ఈ సినిమా ఈవెంట్ లో నిర్మాత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ మూవీ ముగ్గురు నటుల మధ్య జరిగే చిన్న స్టోరీ అని 3, 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలు తీయవద్దని విశాల్ చేసిన కామెంట్లు ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చారు.
విశాల్ లా (Vishal) కామెంట్లు చేయడానికి ఎవరికీ హక్కు లేదని కార్తీక్ వెంకట్రామన్ అన్నారు. ఈ విధంగా చెప్పడానికి హక్కు లేదని ఇదో రకం సనాతన ధర్మం అని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా బడ్జెట్ కు పరిధి ఉండదని కార్తీక్ వెంకట్రామన్ కామెంట్లు చేశారు. కోటి రూపాయలతో సినిమా తీయొచ్చని 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంతో కూడా సినిమా తీయొచ్చని ఆయన చెప్పుకొచ్చారు.
కథ, ఆర్టిస్ట్ ల డిమాండ్ ఆధారంగా బడ్జెట్ ఉంటుందని కార్తీక్ వెంకట్రామన్ పేర్కొన్నారు. విశాల్ మాట్లాడింది కరెక్ట్ కాదని ఆయన తెలిపారు. కార్తీక్ వెంకట్రామన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్లపై విశాల్ నుంచి ఏ విధంగా రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.