Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Varanasi జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » వెంకటేష్ కాదు నేనె ఎక్కువ బాధపడుతున్నాను : సురేష్ బాబు

వెంకటేష్ కాదు నేనె ఎక్కువ బాధపడుతున్నాను : సురేష్ బాబు

  • July 19, 2021 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకటేష్ కాదు నేనె ఎక్కువ బాధపడుతున్నాను : సురేష్ బాబు

వెంకటేశ్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నారప్ప’. డి. సురేష్‌బాబు, కలైపులి యస్‌. థాను నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌బాబు విలేకర్లతో పంచుకున్న విశేషాలు…..

– ‘నారప్ప’ సినిమాను నేను, కలైపుతి యస్‌. థాను కలిసి నిర్మించాము. ఈ ఏడాది ఏప్రిల్‌లో ధనుష్ కర్ణన్‌ సినిమాను థానుగారు విడుదల చేశారు. విడుదలైన మొదటివారంలో 100 శాతం ఆక్యూపెన్సీతో ఉన్న థియేటర్స్‌ కోవిడ్‌ కారణంగా 50 శాతానికి పడిపోయాయి. ఆ నెక్ట్స్‌ వెంటనే సినిమాను తీసేశారు. దానివల్ల థానుగారు దాదాపు 10 కోట్లు నష్టపోయారు. అందుకని ఆయన చిన్న ఆందోళనకు గురయ్యారు. ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనుకున్నప్పుడు కోవిడ్‌ ఉథృతీ చాలా ఎక్కువగా ఉంది. థియేటర్స్‌ ఎప్పుడు రీ ఓపెన్‌ అవుతాయో తెలియదు. ఒకవేళ ఓపెన్‌ అయినా ఆడియన్స్‌ రెస్పాన్స్‌ ఎలా ఉంటుందో తెలియదు. ఇన్ని కారణాల వల్ల నారప్ప సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సివస్తుంది.

– థియేటర్స్‌లో సినిమాలను విడుదల చేయడానికే 1964లో సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను స్టార్ట్‌ చేశాం. ఆ తర్వాత శాటిలైట్‌ వచ్చింది. ఆ నెక్ట్స్‌ హిందీ డబ్బింగ్‌ రైట్స్‌. ఇప్పుడు మల్టీఫుల్‌ మార్కెట్స్‌ ఉన్నాయి. వీటిలో ఒక ఆప్షన్‌ ఓటీటీ. మనం ఓటీటీని ఆపేయగలమని నేను అనుకోవడం లేదు. కానీ కోవిడ్‌ రాకపోయిఉంటే మాత్రం ఓటీటీ ఇంత పాపులర్‌ అయ్యి ఉండేది మాత్రం కాదు. ఓటీటీ వల్ల స్టూడియోస్‌లో వర్క్‌ పెరుగుతుంది. ఆర్టిస్టులు, టెక్నికల్, డబ్బింగ్‌ ఇలా అన్ని సెక్టార్స్‌ వారికి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఎగ్జిబిటర్స్‌ వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. భవిష్యత్‌లో ఓటీటీ, హై క్వాలిటీ థియేటర్స్‌ మాత్రమే ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి..

–‘నారప్ప’ సినిమా థియేటర్స్‌లో విడుదలకానందుకు వెంకటేశే కాదు నేను ఫీల్‌ అవుతున్నాను. అభిమానులు బాధపడుతున్నారు. కానీ మనం లైఫ్‌లో ప్రాక్టీకల్‌గా ఉండక తప్పదు. ‘నారప్ప’ సినిమా నాదే అయితే కచ్ఛితంగా ఓటీటీలో విడుదల చేసేవాణ్ణి కాదు. నాకు పార్ట్‌నర్స్‌ ఉన్నారు. వారి ఆర్థిక సౌకర్యాలు, లబ్ధిని నేను ఆపలేను. ఎగ్జిబిటర్స్‌ సమస్యలను నేను అర్థం చేసుకోగలను. బాధగానే ఉంది. కానీ నా భాగస్వామ్యులను ఇబ్బంది పెట్టలేను. ప్రపంచలోనే అతి పెద్ద ప్రొడక్షన్‌ సంస్థ డిస్నీ కూడా తన సినిమాలను ఏకకాలంలో ఓటీటీ, థియేటర్స్‌లో విడుదల చేస్తుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ సినిమా కూడా ఇదే ఫార్మాట్‌లో విడుదలైంది. ఒకవేళ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మా సినిమా విడుదలవడం వల్ల మాకు లాభం వస్తే ఆ డబ్బులను మేం మళ్లీ ఇండస్ట్రీలోనే పెడుతున్నాం. భవిష్యత్‌లో యాభైసీట్లతో ఉన్న థియేటర్స్‌ సహా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో భారీ మార్పులు వస్తాయి.

– ‘నారప్ప’ లాంటి కథలను ఎవరూ వెంకటేశ్‌ కోసం రాయరు. ఈ సినిమాలో వెట్రిమారన్‌ స్టైల్‌ నాకు నచ్చింది. మాస్‌ ఎలిమెంట్స్‌తో పాటు భారీ ఫ్యామిలీఎమోషన్స్, సామాజిక అంశాలు ఉన్నాయి. సో.. ఈ సినిమా వర్కౌట్‌ అవుతుందని అనిపించింది. యాక్టర్‌గా వెంకటేశ్‌ చాలా బాగా చేశాడు. ఇంట్రవెల్‌కు ముందు ఇసకలో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌తీశాం. అది చాలా కష్టం. వెంకటేశ్‌ అయితే చాలా సిన్సియర్‌గా వర్క్‌ చేశాడు. ఎప్పుడు నారప్ప గెటప్‌లోనే కనిపించారు. బ్యాలెన్స్‌ షూట్‌ కోసం మెంటల్‌గా ప్రిపేర్‌ అయ్యాడు. నారప్ప సినిమా రైట్స్‌ తీసుకున్న తర్వాత శ్రీకాంత్‌ అడ్డాల ఓ సారి వచ్చి ఓ కథ చెప్పారు. ఆ తర్వాత నారప్ప సినిమా గురించి మాట్లాడుకున్నాం. శ్రీకాంత్‌ అడ్డాల డైరెక్ట్‌ చేస్తానన్నారు. చాలా బాగా తెరకెక్కించారు.

– నారప్ప సినిమా షూట్‌ స్టార్ట్‌ చేసిన తర్వాత కొంత భయాందోళనకు గురైయ్యాం. ఫస్ట్‌ షెడ్యూల్‌ 52 రోజుల పాటు చేసి పక్క ఊరిలో కోవిడ్‌ వచ్చిందని సినిమా షూట్‌ను ఆపేశాం. చాలా భయం, భయంగానే ఈ సినిమాను చేశాం. ‘నారప్ప’ నాన్‌ షూటింగ్‌ టైమ్‌లో ఈ సినిమాకు సంబంధించిన నలుగురు చనిపోయారు.

ఎస్పీ మ్యూజిక్‌ను లాంచ్‌ చేశాం. ఇందులో ఫిల్మీ మ్యూజిక్‌తో పాటు ఇతర మ్యూజిక్‌ వీడియోలు కూడా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, గుంటూరు వంటి ప్రదేశాల్లో చిన్న చిన్న స్డూడియోలను స్టార్ట్‌ చేసి కొత్తవారిని ప్రొత్సహించాలనుకుంటున్నాం. రీమేక్‌ సినిమా చేస్తున్నప్పుడు ఓరిజినల్‌ మ్యూజిక్‌కు ఎక్కువమంది కనెక్ట్ అయ్యి ఉంటారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ammu Abhirami
  • #D.Suresh Babu
  • #Kalaippuli S Thanu
  • #Karthik Rathnam
  • #Narappa

Also Read

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రివ్యూ.. ‘పిల్ల జమిందార్’ ని గుర్తుచేసిన రాజు గారు

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రివ్యూ.. ‘పిల్ల జమిందార్’ ని గుర్తుచేసిన రాజు గారు

related news

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Chiranjeevi: ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్ కి చిరు దూరం.. కారణం?

Chiranjeevi: ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్ కి చిరు దూరం.. కారణం?

Mana ShankaraVaraPrasad Garu Trailer: చిరు చిలిపి చేష్టలు.. నయన్‌ రుసరుసలు.. అనిల్‌ నవ్వులు.. సంక్రాంతి సందడి తీసుకొచ్చారుగా!

Mana ShankaraVaraPrasad Garu Trailer: చిరు చిలిపి చేష్టలు.. నయన్‌ రుసరుసలు.. అనిల్‌ నవ్వులు.. సంక్రాంతి సందడి తీసుకొచ్చారుగా!

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

trending news

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

1 hour ago
Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

5 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

6 hours ago
Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

8 hours ago
OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

8 hours ago

latest news

Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయిందట..!

Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయిందట..!

12 hours ago
Chiranjeevi: చిరంజీవి నోట కాస్ట్‌ కంట్రోల్‌ మాట.. ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా?

Chiranjeevi: చిరంజీవి నోట కాస్ట్‌ కంట్రోల్‌ మాట.. ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా?

13 hours ago
Chiranjeevi: డ్రమ్స్‌, కీబోర్డ్స్‌ అంటూ.. చిరంజీవి సెటైర్లు ఎవరి మీద… ఏ సినిమా మీద!

Chiranjeevi: డ్రమ్స్‌, కీబోర్డ్స్‌ అంటూ.. చిరంజీవి సెటైర్లు ఎవరి మీద… ఏ సినిమా మీద!

13 hours ago
Anasuya : శివాజీ చెప్పింది కరెక్ట్ యే కానీ… : అనసూయ

Anasuya : శివాజీ చెప్పింది కరెక్ట్ యే కానీ… : అనసూయ

13 hours ago
Chiranjeevi: అనిల్‌ రావిపూడి పరువు చిరంజీవి తీసేయబోయారా? నయన్‌ విషయంలో!

Chiranjeevi: అనిల్‌ రావిపూడి పరువు చిరంజీవి తీసేయబోయారా? నయన్‌ విషయంలో!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version