పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థకి చెందిన ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్లపై యువ రచయిత, దర్శకుడు రాజసింహ తాడినాడ ఇబ్బందికరమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదిక జరిగిన ఈ అనవసరపు చర్చ ఇప్పుడు కేసుల వరకు వెళ్లింది. రాజసింహ తనను అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ పోస్టులు, కామెంట్లు చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వివేక్ కేసు పెట్టారు. తన ప్రతిష్ఠను దిగజార్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాంతోపాటు తన కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపు సందేశాలు పంపుతున్నారని వివేక్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణను ప్రారంభించారు. తనతో పాటు రాఘవేంద్ర రావు, వైవీయస్ చౌదరి, ఠాగూర్ మధు లాంటి వాళ్లను కూడా కూడా రాజసింహ దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఈ కేసు ఎటువైపు వెళ్తుందో అని టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
దర్శకుడు రాజసింహ తాడినాడ అంటే పెద్దగా గుర్తుకురాకపోవచ్చు. అయితే రైటర్ రాజసింహ అంటే ఈజీగా గుర్తొస్తుంది. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలకు ఆయన రచయిత. ‘రుద్రమదేవి’ సినిమాలో బన్నీ పాత్ర గోన గన్నారెడ్డికి మాటలు రాసింది ఆయనే. ఆ తర్వాత సందీప్ కిషన్ – నిత్య మీనన్‌తో ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే సినిమా చేశారు. ఆ సినిమా సరైన ఫలితం అందుకోలేదు.
అయితే ఏమైందో ఏమో హఠాత్తుగా ఇటీవల నిర్మాత వివేక్ కూచిబొట్లపై రాజసింహ ఇటీవల కొన్ని అభ్యంతరకర కామెంట్స్ చేశారు. వాటిని ఆయన అప్పుడు ఖండించలేదు కానీ.. ఆదిత్య ఖండించారు. అంతేకాదు రాజసింహ కోసం వివేక్ చేసిన సాయం గురించి మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడు అని రాజసింహను హెచ్చరించారు. అయితే దానికి ప్రతిగా రాజసింహ ఆదిత్యను దుర్భాషలాడుతూ సింగర్ సునీత టాపిక్‌ను మధ్యలోకి లాగారు.
గతంలో ఓసారి రాజసింహ (Rajasimha) ఆత్మహత్యాయత్నం చేశారు. అలాగే వివేక్ గతంలో రాజసింహకు సాయం చేశారు అనేది ఇండస్ట్రీ మాట. మరి అంత సాయం చేసిన ఆయన్ను ఇప్పుడు రాజసింహ ఎందుకు అన్నట్లు, దానికి ఆదిత్య ఎందుకు స్పందించినట్లు అనేది ఇక్కడ డౌట్. కేసుల వరకు ఈ విషయం వెళ్లింది కాబట్టి త్వరలో ఏదో క్లారిటీ వస్తుంది.