Pushpa Movie: పుష్ప అతిథులపై తేల్చి చెప్పిన మైత్రి!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మాస్ మూవీ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అల్లు అర్జున్ మొదటి సారి ఒక పాన్ ఇండియా సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా కు దాదాపు 180 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ఇప్పటికే నిర్మాతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమాకు సంబంధించిన ట్రైలట్ ను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ట్రైలర్ కు మాత్రమే కాకుండా విడుదలవుతున్న పాటలకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుతోంది. అయితే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు. పోలీస్ గ్రౌండ్స్ లో జరగబోయే ఈ వేడుకకు కొంతమంది సినీ ప్రముఖులు కూడా ప్రత్యేక అతిథులుగా రాబోతున్నట్లు కథనాలు వెలువడ్డాయి.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు అలాగే దర్శకుడు రాజమౌళి కూడా వస్తాడు అని అందరూ అనుకున్నారు. ఇక అంతకుముందు అయితే రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కూడా వస్తారని కూడా కథనాలు వెలువడ్డాయి. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాతలు అందులో ఎలాంటి నిజం లేదని ఒక క్లారిటీ ఇచ్చేశారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ హీరోలు ఎవరు రావడం లేదు అని చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు. దీంతో వైరల్ అవుతున్న కథనాలు అన్నీ కూడా అబద్ధాలు అని తెలిపోయాయి. ఇక చిత్ర యూనిట్ సభ్యులు మాత్రమే రాబోతున్నారట. మరి సోలోగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమాను జనాల్లోకి ఎలా తీసుకు వెళతారో చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus