నిర్భయ దోషులకు ఎట్టకేలకు శిక్ష పడింది. నిర్భయ రేప్ కేసులో నిందితులుగా ఉన్న ముకేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తాలను మార్చి 20 న ఉదయాన్నే ఢిల్లీలోని తీహార్ జైలు నందు ఉరితీయడం జరిగింది. ఉరి అనంతరం నలుగురి శవాలను వారి కుటుంబ సభ్యలకు అప్పగించారు. ఇక ఈ కేసులో ఉన్న మరో ఇద్దరు నేరస్థులు రామ్ సింగ్ జైలులో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకోగా, జువనైల్ శిక్షా కాలం అనంతరం ఎక్కడో అజ్ఞాతంలో బ్రతుకుతున్నాడు.
కాగా వీరి కథను ఇప్పుడు వెండితెరపైకి తేవడానికి అనేక మంది దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. ఓ సినిమాకు మించిన నాటకీయ వీరి జీవితాలలో చోటు చేసుకుంది. నిర్భయను రన్నింగ్ బస్ లో మానభంగం మరియు చిత్ర హింసలకు గురిచేయడం నుండి జైలులో వారు గడిపిన కాలం, మరణ శిక్ష పడే వరకు అనేక ఆసక్తికర సంఘటనలు జరిగాయి. ఈ సంఘటన అనేక కొత్త చట్టాల రూప కల్పనకు దారి తీసింది. ఇక ఉరి శిక్ష ప్రకటించిన తరువాత నలుగురు నేరస్థులు చట్టంలోని లొసుగులన్నీ వాడుకొని శిక్షను వాయిదా వేస్తూ వచ్చారు. ఇంత పెద్ద డ్రామా ఈ అమానుషమైన కేసులో నడవగా దీన్ని తెరపై ఆవిష్కరించడానికి కొందరు దర్శకులు సిద్దమైనట్లు తెలుస్తుంది. మరి ఇలాంటివన్నీ తీయడానికి ముందుండే మన వర్మ గారు కూడా ఈ కథను గెలక కుండా ఉండడు.
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్