ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో శరవేగంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె మూవీ మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రేక్షకులు మరో కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారని నాగ్ అశ్విన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అయితే ప్రాజెక్ట్ కె మూవీ హక్కులు రికార్డు రేటుకు అమ్ముడయ్యాయి. నైజాం ఏరియాలో ఊహించని రేటుకు ఈ సినిమా హక్కులు అమ్ముడవడం గమనార్హం.
ఏకంగా 70 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయని తెలిసి అవాక్కవడం ఇండస్ట్రీ వర్గాల వంతవుతోంది. ఆసియన్ సునీల్ సారథ్యంలోని సిండికేట్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్టు బోగట్టా. ఈ సిండికేట్ పంపిణీ చేసిన సీతారామం, ధమాకా, కార్తికేయ2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కే సినిమాపై ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సత్తా ఏంటో ప్రూవ్ చేస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ కె నైజాం హక్కులతో ప్రభాస్ చరిత్ర తిరగరాస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సాహో, రాధేశ్యామ్ కమర్షియల్ గా ఓ రేంజ్ లో సక్సెస్ సాధించకపోయినా ప్రభాస్ మార్కెట్ మాత్రం చెక్కుచెదరలేదు.
ప్రాజెక్ట్ కె తెలుగు రాష్ట్రాల హక్కులు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సలార్ మూవీ హక్కులు సైతం ఇదే రేంజ్ లో అమ్ముడయ్యే ఛాన్స్ అయితే ఉంది. బాహుబలి సిరీస్ సినిమాల సక్సెస్ తో ప్రభాస్ మార్కెట్ ఏ స్థాయిలో పెరిగిందో ఈ సినిమాల ద్వారా ప్రూవ్ అవుతోందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.