Project K: ‘ప్రాజెక్ట్ కె’ నుండి ఎంట్రీ ఇచ్చిన రైడర్స్.. వైరల్ అవుతున్న వీడియో!

ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది అంటూ నిర్మాత అశ్వినీదత్ చెప్పకనే చెప్పారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతుందనే ప్రచారం ఎప్పటి నుండో నడుస్తూనే ఉంది.

దాని పై ఎటువంటి క్లారిటీ లేదు కాదు. ఇదిలా ఉండగా.. తాజాగా ‘ప్రాజెక్ట్ కె’ (Project K) నుండి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ అయ్యింది. ‘ప్రాజెక్ట్ కె’ రైడర్స్ అనే కాన్సెప్ట్ తో ఈ వీడియోని డిజైన్ చేయడం జరిగింది. ప్రభాస్ కటౌట్ కు తగ్గట్టు యాక్షన్ ఎలిమెంట్స్ ను డిజైన్ చేసే క్రమంలో ఈ రైడర్స్ ను రంగంలోకి దింపాడు నాగ్ అశ్విన్. వీళ్ళు ప్రభాస్ పై దాడి చేయడానికి వస్తే..

అతను వీరిని చితిక్కొడుతుంటే విజువల్ ఏ రేంజ్లో ఉంటుందో అనేది మన ఊహలకే వదిలేశాడు. ఇక ఈ రైడర్స్ ‘ప్రాజెక్ట్ కె’ మేకింగ్ లో చేసిన ఫన్ అంతా ఈ వీడియోలో చూపించారు. ‘ప్యాంటు చినిగిపోయిందా’ అంటూ సెటైర్లు వేసుకుని మరీ ఈ చిత్రం షూటింగ్లో పాల్గొన్నట్టు ఈ వీడియో చెప్పకనే చెబుతుంది. ప్రాజెక్ట్ కె చిత్రం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుపుతూ సాంపుల్ గా ఈ వీడియోని వదిలారు. మీరు కూడా ఓ లుక్కేయండి :

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus