తెలుగమ్మాయి అయినటువంటి సుమయ రెడ్డి (Sumaya Reddy) హీరోయిన్‌గా, నిర్మాతగా చేసిన చిత్రం ‘డియర్ ఉమ’ (Dear Uma). ఏప్రిల్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘డియర్ ఉమ’ కి కథ అందించింది కూడా సుమయ రెడ్డి కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక పృథ్వీ అంబర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ‘ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరిగే వాటిని ఈ సినిమాలో చూపించబోతున్నారు.
డాక్టర్లు, పేషెంట్స్‌కి మధ్యలో ఉండే పర్సన్స్ సరిగ్గా లేకపోతే ఎలాంటి దారుణాలు జరుగుతాయి?’ అనేది ఈ సినిమా థీమ్.దీనిని వివరిస్తూ ప్రమోషన్లో భాగంగా ‘వైద్యమా’ అనే ఒక పాటను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ ‘వైద్యమా’ పాట 3 నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘వైద్యం శరణం గచ్చామి’ అంటూ బ్యాక్ గ్రౌండ్ లిరిక్ తో మొదలైన ఈ పాట ‘వైద్యమా వైద్యమా మారని వైనమా… మారణ హోమమా రోగాలతో వ్యాపారమా’ అంటూ సాగింది. ఈ లిరిక్స్ ను బట్టి.. ఈ పాట థీమ్ అందరికీ అర్థమైపోతుంది.
అలాగే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో ప్రజల ఆరోగ్యాలతో డాక్టర్లు చేస్తున్న వ్యాపారాన్ని ఎత్తి చూపేలా ఈ పాట ఉంది. సాయి రాజేష్ మహాదేవ్ అందించిన లిరిక్స్ చక్కగా వెంటనే అర్థమయ్యేలా ఉన్నాయి. సంగీత దర్శకుడు రథన్ అందించిన ట్యూన్ కూడా అందరూ ఇన్వాల్వ్ అయిపోయేలా కట్టిపడేస్తుంది. మొత్తంగా చాలా మీనింగ్ ఫుల్ గా ఈ పాట ఉంది. మీరు కూడా ఒకసారి ఈ లిరికల్ సాంగ్ ను చూస్తూ వినండి :