Puri, Chiru: చిరు – పూరి పాయింట్‌ వింటుంటే ఆ సినిమాలానే ఉంది.. క్లారిటీ ఎప్పుడిస్తారో?

మెగాస్టార్‌ చిరంజీవి – పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌… దీని గురించి అభిమానులు చాలా రోజుల నుండి వెయిట్‌ చేస్తున్నారు. అప్పుడెప్పుడో ‘ఆటో జానీ’ అనే సినిమాను అనౌన్స్‌ చేసి.. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆపేశారు. దాని గురించి ఆ తర్వాత చాలా రోజులు చర్చ నడిచింది. అయితే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి కొత్త కథ రాస్తున్నాను అంటూ ఆ మధ్య పూరి చెప్పడంతో.. కొత్త కథేంటి, ఎలా ఉండొచ్చు అనే చర్చ మొదలైంది. అయితే కథ చివరిదశకొచ్చింది అని అంటున్నారు.

డేర్ అండ్ డాషింగ్ సినిమాలు చేస్తూ.. పూరి జగన్నాథ్ టాలీవుడ్‌లో ఓ లెవల్‌లోకి వచ్చారు. గతంలో చాలా ఫ్లాప్‌లు చూసినా.. రీసెంట్‌ డిజాస్టర్‌ ‘లైగర్‌’ సినిమాతో చాలా ఇబ్బందులుపడుతున్నారు. ఆర్థికంగా చాలా డౌన్‌ అయిపోయారు అని అంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో ఓ పాత్ర చేసి అదుర్స్‌ అనిపించి, ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేసే సెకండ్‌ ఛాన్స్‌ సంపాదించారు. తొలి ఛాన్స్‌ పోగొట్టుకున్న పూరి.. ఈసారి బలంగా కథ రాసుకుంటున్నారట.

చిరంజీవి కోసం పూరి జగన్నాధ్ (Puri) మంచి ఎంటర్ టైన్మెంట్ ఉన్న కథను సిద్ధం చేశారట. త్వరలోనే కథ వినిపించబోతున్నారని టాక్‌ నడుస్తోంది. అలాగే ఇదొక ఎమోషనల్ యాక్షన్ స్టోరీ అని సమాచారం. తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ కథలో ఓ థ్రిల్లింగ్ పాయింట్‌ ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఎమోషన్ ఉన్నా, మెయిన్‌గా కామెడీనే హైలైట్‌ అవుతుంది అని చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. ఇదేదో రీమేక్‌ అనే మాట కూడా వినిపిస్తోంది.

మలయాళంలో మంచి విజయం అందుకున్న ‘బ్రో డాడీ’ సినిమా రీమేక్‌ రైట్స్‌ను రామ్‌చరణ్‌, అతని సన్నిహితులు కొనుగోలు చేశారని సమాచారం. దీంతో ఆ సినిమానే ఈ సినిమానా అనే చర్చ నడుస్తోంది. ఆ కథను పూరి తన స్టైల్‌లో సినిమాగా మలుస్తున్నారని అంటున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ వస్తుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus