దుబాయ్ కి అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ షారుక్ ఖాన్ అయితే.. బ్యాంకాక్ కి అనఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ పూరీ జగన్నాధ్. టాలీవుడ్ ఇండస్ట్రీ బ్యాంకాక్ కి షూటింగ్స్ కోసం లేదా స్టోరీ డిస్కషన్స్ కోసం వెళ్ళడం మొదలెట్టడానికి కారణం పూరీ జగన్నాధ్. అయితే.. ఈమధ్యకాలంలో బ్యాంకాక్ ఎందుకో పూరీకి పెద్దగా అచ్చిరాలేదు. “దేవుడు చేసిన మనుషులు” మొదలుకొని ఆయన బ్యాంకాక్ లో కూర్చుని రాసుకున్న కథలు హిట్ అవ్వలేదు. ఆయన తీసిన మునుపటి హిట్ సినిమా కథ వక్కంతం వంశీ రాయగా.. రీసెంట్ హిట్ ఫిలిమ్ “ఇస్మార్ట్ శంకర్” స్టోరీని ఆయన గోవాలో కూర్చుని రాసుకొన్నాడు. సినిమా షూటింగ్ కూడా ముప్పాతిక శాతం అక్కడే తీశాడు. ఆ సినిమాతోపాటు కుమారుడు ఆకాష్ పూరీ కథానాయకుడిగా నటిస్తున్న రెండో చిత్రం “రోమాంటిక్” షూటింగ్ కూడా అక్కడే జరిగింది.
దాంతో తాను త్వరలో తెరకెక్కించబోయే “ఫైటర్” సినిమా కోసం కూడా బ్యాంకాక్ కాకుండా గోవాను ఎంపిక చేసుకొన్నాడు పూరీ జగన్నాధ్. ఆల్రెడీ కథను ఆల్మోస్ట్ ఫైనల్ చేసిన పూరీ జగన్నాధ్ ప్రస్తుతం హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువశాతం గోవాలో చేయనున్నాడు.