Purushothamudu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘పురుషోత్తముడు’.!
- September 1, 2024 / 09:00 AM ISTByFilmy Focus
రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా ‘పురుషోత్తముడు’ అనే సినిమా రూపొందింది.రామ్ భీమన డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్’ సంస్థ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ..లు ఈ చిత్రాన్ని నిర్మించారు. హాసిని సుధీర్.. రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. జూలై 26న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్స్ …పర్వాలేదు అనిపించాయి. మరోపక్క లావణ్యతో వివాదం వల్ల రాజ్ తరుణ్ గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్న తరుణంలో రిలీజ్ అయిన సినిమా కాబట్టి ‘పురుషోత్తముడు’ పై ప్రేక్షకుల దృష్టి పడింది.
Purushothamudu Collections

మొదటి రోజు ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. అయితే ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.రెండో రోజు నుండి కూడా పికప్ అయ్యింది అంటూ ఏమీ లేదు.ఒకసారి (Purushothamudu Collections) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.23 cr |
| సీడెడ్ | 0.08 cr |
| ఉత్తరాంధ్ర | 0.15 cr |
| ఈస్ట్+వెస్ట్ | 0.08 cr |
| కృష్ణా+గుంటూరు | 0.14 cr |
| నెల్లూరు | 0.05 cr |
| ఏపి+తెలంగాణ | 0.73 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.07 cr |
| వరల్డ్ వైడ్(టోటల్) | 0.80 cr |
‘పురుషోత్తముడు’ (Purushothamudu Collections) సినిమా చాలా వరకు రెంటల్ పద్ధతిలోనే రిలీజ్ చేశారు. వాటి వాల్యూ రూ.1.22 కోట్లుగా ఉంది. సో బ్రేక్ ఈవెన్ కి ఈ సినిమా రూ.1.8 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.0.80 కోట్ల షేర్ ని రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.1.0 కోట్ల(షేర్) దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది ఈ మూవీ.












