రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా ‘పురుషోత్తముడు’ అనే సినిమా రూపొందింది.రామ్ భీమన డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్’ సంస్థ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ..లు ఈ చిత్రాన్ని నిర్మించారు. హాసిని సుధీర్.. రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. జూలై 26న అంటే మరికొన్ని గంటల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పెద్దగా ప్రమోషన్ లేకుండానే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
టీజర్, ట్రైలర్స్ …పర్వాలేదు అనిపించినా రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఏమో అనే డౌట్స్ ని రేకెత్తించింది. మరోపక్క లావణ్య వివాదం వల్ల ఈ సినిమా సంగతేంటి అనే డిస్కషన్స్ కూడా ముమ్మరంగా జరిగాయి. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్.. ప్రారంభం డీసెంట్ గానే ఉందట. లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ వంటివి బాగానే ఉన్నా..
శ్రీమంతుడు (Srimanthudu) వంటి పాత సినిమాలను తలపించాయని అంటున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఓకే అంటున్నారు. అయితే సెకండాఫ్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ నే గుర్తుచేస్తుందట. రాజ్ తరుణ్ పెర్ఫార్మన్స్, ఫైట్స్ వంటివి బాగానే ఉంటాయట. క్లైమాక్స్ కూడా జస్ట్ ఒకే అనే విధంగా ఉందట. మొత్తంగా బి,సి సెంటర్స్ కి ఈ సినిమా టైం పాస్ గా అనిపిస్తుందట. మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ కి పెద్దగా రుచించకపోవచ్చు అని అంటున్నారు.