సినిమాల ప్రభావం యువత మీద బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ మాట విషయంలో ఎవరికైనా డౌట్ ఉంటే.. ఈ వార్త కచ్చితంగా చదవాల్సిందే. ఎందుకంటే యువత మీద చూపిస్తున్న ప్రభావం.. ఇంకా చెప్పాలంటే చెడు ప్రభావం ఎక్కువగా ఉండటానికి సినిమాలు ఓ కారణం అని ఈ వార్త చెబుతుంది. అయితే ఆ కుర్రాడు ఎవరో సరదాకు రాసి ఉండొచ్చు అనొచ్చు. అయితే ఎలా రాసినా విద్యార్థులకు ఇది సరికాదు అనే మాట వినిపిస్తోంది. ఇంతకీ ఏమైందంటే..
ఓ పదో తరగతి విద్యార్ధి ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) సినిమాలోని డైలాగ్ లాంటి డైలాగ్‌ను ఓ స్కూలు గోడ మీద రాశాడు. దానికేముంది డైలాగ్ కదా అనొచ్చు. అయితే ఆ మాట పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్‌ను ఛాలెంజ్ చేసేలా ఉండటమే ఇక్కడ సమస్య. సినిమాలోని ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్’ అంటూ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) (భన్వర్ సింగ్ షెకావత్)ను అల్లు అర్జున్ (Allu Arjun) (పుష్పరాజ్) అంటాడు గుర్తుందా? ఆ డైలాగే ఇప్పుడు మర్చారు.
ఇంటర్వెల్ సీన్‌కి ముందు షెకావత్‌కు సారీ చెప్పడానికి పూటుగా తాగి పార్టీకి వెళ్లిన ‘పుష్ప’రాజ్.. తొడగొట్టి మరీ ఆ డైలాగ్ చెబుతాడు. ఇక్కడ ఆ స్టూడెంట్ ఎగ్జామ్స్‌కి ముందు ఈ డైలాగ్ చెప్పాడు. ‘దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్.. నీయవ్వ తగ్గేదేలే’ అనేది ఆ విద్యార్థి రాసిన మాట. ఇదేదో సరదాకి అనుకుందాం అంటే మిగిలిన పిల్లలు చెడిపోతారు. ఈ మాటతోపాటు విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతున్న ఆ ఫొటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
దీంతో ఆ ఇమేజ్, వీడియో వైరల్‌గా మారింది. ఇది నేటి యువత తీరు అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘పుష్ప : ది రైజ్’ సినిమా విడుదలైనప్పుడు కూడా కోల్‌కతాలోని ఓ ఎగ్జామ్‌సెంటర్‌లో ‘పుష్ప రాజ్.. అపున్ లిఖేగా నహీ’ అని రాశారు. దీంతో ఆ విషయం వైరల్ అయింది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ‘పట్టుకోరా షెకావత్’ డైలాగ్ కనిపించింది. ఇది సరికాదు అని విద్యార్థులకు బద్ధులు తప్పక చెప్పాల్సిన పరిస్థితి.
*దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్ పట్టుకుంటే వదిలేస్తా బుక్కులెట్టు….*
*నీయవ్వ తగ్గేదేలే….*ఇది ఒక స్టూడెంట్ ఎస్ఎస్సి పరీక్షల కేంద్రం దగ్గర రాసి వెళ్ళాడు….#Pushpa #Alluarjun #Pushpa2TheRule pic.twitter.com/bJRqz3O6n1
— Milagro Movies (@MilagroMovies) March 18, 2025