అక్టోబర్, నవంబర్ నెలలు సినిమాలకి డ్రై సీజన్ అంటుంటారు. పెద్ద సినిమాలు ఈ టైంలో రిలీజ్ కావు. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే డిసెంబర్ నెల ఏ సినిమాకి అయినా మంచి సీజన్. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువగా థియేటర్లకి వెళ్లేందుకు ఇష్టపడతారు. 2023 డిసెంబర్ చూసుకుంటే ‘యానిమల్’ ‘సలార్’ వంటి సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి.
గతేడాది రిలీజ్ అయిన ‘పుష్ప 2’ కూడా భారీ వసూళ్లు సాధించింది. కానీ డిసెంబర్ 4 డేట్ పెద్ద సినిమాలకి ఎందుకో కలిసి రావడం లేదు అని కొందరు భావిస్తున్నారు. ‘పుష్ప 2’ ప్రీమియర్స్ డిసెంబర్ 4న పడ్డాయి. ఆరోజు సంధ్య థియేటర్ ఘటన అందరినీ కలచివేసింది. అల్లు అర్జున్ కూడా దాని వల్ల జైలుకి వెళ్లాల్సి వచ్చింది. వెంటనే బయటకు వచ్చినప్పటికీ.. ఆ ఘటనలో మరణించిన రేవతి, గాయపడ్డ ఆమె కుమారుడు శ్రీ తేజ్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు.

‘రాబిన్ హుడ్’ సినిమా టైంలో ‘ప్రీమియర్స్ మాకు కలిసి రాలేదు’ అని నిర్మాత మైత్రి రవి పలికిన సంగతి తెలిసిందే.సరిగ్గా ఏడాది తర్వాత ‘అఖండ 2’ ప్రీమియర్స్ పడాల్సి ఉంది.

డిసెంబర్ 5న రిలీజ్ అనుకున్న ఈ సినిమాకి డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు వేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆర్థిక లావాదేవీల కారణంగా సినిమా విడుదల నిలిచిపోయింది. ఇప్పటికీ ఇష్యూస్ క్లియర్ అవ్వలేదు. ఈ వీకెండ్ కి సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలీని పరిస్థితి.2026 లో ఏదైనా పెద్ద సినిమాని డిసెంబర్ 5న రిలీజ్ అని ప్రకటించి.. డిసెంబర్ 4న ప్రీమియర్స్ అని ప్రకటించాలంటే ఒకటికి, రెండుసార్లు మేకర్స్ ఆలోచిస్తారేమో.
