Pushpa: ‘పుష్ప’ బాలీవుడ్‌ రిలీజ్‌ లైన్‌ క్లియర్‌ వెనుక అతను!

పాన్‌ ఇండియా స్టార్‌ తనను తాను ప్రజెంట్‌ చేసుకోవడానికి అల్లు అర్జున్‌ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘పుష్ప’ సినిమాను దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నారు. దీని కోసం పీఆర్‌లతో మాట్లాడి… అక్కడ బూమ్‌ క్రియేట్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌ పీఆర్‌లను ఇటీవల కలిశారని టాక్‌. అయితే హిందీలో సినిమా రిలీజ్‌ ఈసారికి కష్టమే అని వార్తలొస్తున్నాయి. కానీ హిందీ రిలీజ్‌ ఇష్యూ తేలిపోయిందని టాక్‌. ‘పుష్ప’ విడుదలకు గట్టిగా చూస్తే నెల రోజులు ఉంది.

ఐటెమ్‌ సాంగ్‌ మినహా సినిమా చిత్రీకరణ పూర్తయిపోయింది. త్వరలో దాన్ని కూడా పూర్తి చేసి డిసెంబరు 17న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. కానీ బాలీవుడ్‌లో విడుదలకు అక్కడి నిర్మాత సిద్ధంగా లేరని వార్తలొచ్చాయి. పంపిణీ విషయంలో సమస్యలు రావడంతో వెనకడుగు వేస్తున్నారని టాక్‌. అందుకే ఇటీవల హిందీ పాట కూడా విడుదల చేయలేదని కూడా అన్నారు. దీంతో గీతా ఆర్ట్స్‌ రంగంలోకి దిగి మొత్తం సెట్‌ చేసిందట. గీతా ఆర్ట్స్‌కు బాలీవుడ్‌లోనూ మంచి సంబంధాలున్నాయి.

కొడుకు సినిమాకు భారీ రిలీజ్‌ పక్కా అనుకుంటుండగా హిందీ సినిమా లేదు అంటే… అల్లు అరవింద్‌ ఎందుకు ఊరుకుంటారు. తన టాక్టిక్స్‌తో మొత్తం ఇష్యూను సెట్‌ చేసేశారట. ఇప్పుడు అన్ని భాషలతోపాటు డిసెంబరు 17న బాలీవుడ్‌లో కూడా సినిమా విడుదల చేస్తారట. పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్‌ను విస్తరించాలనుకుంటున్న బన్నీ ‘పుష్ఫ’ హిందీ రిలీజ్ విషయంలో పట్టుదలతో ఉన్నాడంట.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus