Pushpa: లక్కీ గర్ల్‌ or మిల్కీ బ్యూటీ

సుకుమార్‌ – దేవిశ్రీప్రసాద్‌ కాంబినేషన్‌ అంటే ఓ బ్లాక్‌బస్టర్‌ ఐటెమ్‌ సాంగ్‌ పక్కా. అందులోనూ అల్లు అర్జున్‌ ఆ కాంబోకి కలిశాడు అంటే… ఆ ఎఫెక్ట్‌ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఈ ముగ్గురు కలయికలో ‘పుష్ప’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ… ఐటెమ్‌ సాంగ్‌ మినహా అంతా పూర్తయిందట. త్వరలోనే ఈ ఐటెమ్‌ సాంగ్‌ తెరకెక్కిస్తారట. ఈ పాట చాలా రోజుల క్రితమే రెడీ అయ్యింది. త్వరలో షూట్‌ అంటున్నారు.

ఈ పాటకు మాస్‌ గీతాల స్పెషలిస్ట్‌ శేఖర్ మాస్టర్‌ నృత్య రీతులు సమకూరుస్తారని సమాచారం. అయితే మరి ఆయన స్టెప్పలను వేసే ఆ భామ ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. చాలా రోజుల నుండి ఈ చర్చ నడుస్తోంది. ఆఖరుగా ఇద్దరు స్టార్‌ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ టాలీవుడ్‌లో ఐటెమ్‌ గీతాల స్పెషలిస్ట్‌లే. ఒకరు సీనియర్‌ స్టార్‌ నాయిక అయితే, మరొకరు జూనియర్‌ స్టార్‌ నాయిక. ఇప్పటికే ‘పుష్ప’ విషయంలో ‘రంగస్థలం’ పోలికలు కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

 

దీంతో జూనియర్‌ స్టార్‌ నాయిక అయిన పూజా హెగ్డేను కాకుండా, సీనియర్‌ స్టార్‌ నాయిక అయిన తమన్నా వైపు మొగ్గు చూపుతున్నారని టాక్. అల్లు అర్జున్‌కి పూజ అంటే సెంటిమెంట్‌. కాబట్టి బన్నీ ఇటువైపు ఆలోచిస్తున్నాడట. ఫైనల్‌గా ఎవరు సెలక్ట్‌ అవుతారో చూడాలి. ఈ వారంలోనే ఈ పాట షూట్‌ ఉంటుంది అంటున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus