Pushpa: రష్యాలో ల్యాండ్ అయిన పుష్ప టీం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2021 డిసెంబర్ 17న రిలీజ్ అయిన ‘పుష్ప'(పుష్ప ది రైజ్) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది.ఇప్పుడు ఈ చిత్రాన్ని రష్యాలో కూడా విడుదల చేయబోతున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల తర్వాత ఇలా విదేశాల్లో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ లో ‘పుష్ప’ కూడా చేరడం విశేషం. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నటనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ఇక ‘పుష్ప ది రైజ్’ రష్యన్ ట్రైలర్ ని ఈ మధ్యనే విడుదల చేశారు. రష్యన్ లాంగ్వేజ్ లో ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో పుష్ప ప్రమోషన్ల కోసం టీం రష్యా వెళ్ళింది. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రీమియర్స్ స్క్రీనింగ్ కానున్నాయి. వీటిలో పుష్ప టీం పాల్గొనబోతుంది. దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక, హీరో అల్లు అర్జున్ రష్యాలో ల్యాండ్ అయ్యారు.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎయిర్ పోర్ట్ లో అక్కడి జనాలు పుష్ప టీంకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి ఈ మూవీని గట్టిగా ప్రమోట్ చేయబోతున్నారు పుష్ప టీం సభ్యులు. ప్రస్తుతానికి ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

 

 

 

 

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus