Pushpa2: ‘పుష్ప’రాజ్‌ టీమ్‌ సరికొత్త ప్లాన్‌… ఫ్యాన్స్‌ని ఖుష్‌ చేయడానికేనా?

‘పుష్ప’రాజ్‌ విషయంలో బన్నీ ఫ్యాన్స్‌ చాలా కోపంగా ఉన్నారు. ఈ మాట మేం అనడం లేదు. సినిమా టీమ్‌ల ట్విటర్‌ హ్యాండిల్స్, హ్యాష్‌ట్యాగ్స్‌ చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ చాలా రోజుల నుండి ఎదురుచూస్తుండటమే కారణం. సినిమా మొదలైందో లేదో తెలియక చాలా రోజులు వెయిట్‌ చేసిన ఫ్యాన్స్‌.. మొదలైంది అని తెలిశాక అప్‌డేట్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. కనీసం రూమర్స్‌ కూడా రాకపోవడంతో ఇంకా హర్ట్‌ అవుతున్నారు.

దీంతో వారిని కూల్‌ చేసే పనిలో టీమ్‌ వస్తోందని తెలుస్తోంది. అవును, ‘పుష్‌ 2’ ఇనిమాకు సంబంధించి నిర్మాతలు అప్‌డేట్‌ను రెడీ చేశారు అని సమాచారం. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కి స్పెషల్‌ డే అయిన ఏప్రిల్‌ 8న ఈ అప్‌డేట్‌ రాబోతోందని సమాచారం. ఆ రోజు ఏంటి స్పెషల్‌ అనేది తెలిసిందే. ఆ రోజు ఐకాన్‌ స్టార్‌ పుట్టిన రోజు. దీంతో సినిమా అప్‌డేట్‌ను ఆ రోజు ఇస్తే ఫ్యాన్స్‌ చాలా హ్యాపీ ఫీల్‌ అవుతారని టీమ్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తోంది అని చెప్పాలి.

అలాగే సినిమా గురించి వార్త కొద్ది రోజులు ప్రేక్షకుల నోళ్లలో నానేలా చేయొచ్చు అని అనుకుంటున్నారు. ఏప్రిల్‌ 8న మూడు నిమిషాల నిడివి ఉన్న ఓ టీజర్‌ను రిలీజ్‌ చేస్తారని సమాచారం. ఆ వీడియోలో పూర్తి యాక్షన్‌ సన్నివేశాలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారని కూడా అంటున్నారు. అలాగే బన్నీ లుక్‌లో ఉండే చిన్నపాటి మార్పులు కూడా ఇందులో కనిపిస్తాయి అని చెబుతున్నారు. అలా అని సినిమాలోని కీలక వ్యక్తుల్ని, అంశాల్ని చూపించే అవకాశం లేదు అని చెబుతున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరోవైపు ‘పుష్ప2’ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. విశాఖపట్నం, హైదరాబాద్‌లో సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీని కోసం రెండు టీమ్‌లు పని చేస్తున్నాయి భోగట్టా. ఇక ఈ సినిమా కోసం సుకుమార్‌ ఇప్పటికే స్టోరీ బోర్డు మొత్తం గీయించి దాని ప్రకారం షూట్‌ చేస్తున్నారని సమాచారం.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus