అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్’ చిత్రం 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అదీ ఆంధ్రాలో తప్ప అన్ని ఏరియాల్లోనూ ఘనవిజయం సాధించింది. అల్లు అర్జున్ నటనకు అన్ని భాషల్లోని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బన్నీ మేనరిజమ్స్ కూడా అన్ని చోట్లా పాపులర్ అయ్యాయి.
మొదట ఈ చిత్రానికి కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. తాజాగా మరో అరుదైన గౌరవం పుష్ప సినిమాకు దక్కింది. ఇదిలా ఉండగా.. ‘పుష్ప’ కి తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కడం విశేషం. వివరాల్లోకి వెళితే… దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 అవార్డ్స్‌లో ‘ఫిలిం ఆఫ్ ద ఇయర్’ గా ‘పుష్ప’ నిలిచింది. దీంతో ‘పుష్ప’ యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ‘ముత్తంశెట్టి మీడియా’ తో కలిసి నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన ‘శ్రీవల్లి’ ‘సామి సామి’ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ‘ఉ అంటావా ఉఊ అంటావా’ పాట అయితే దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. త్వరలోనే ‘పుష్ప 2’ షూటింగ్ కూడా మొదలుకానుంది. కుదిరితే ఈ ఏడాదిలోనే ఆ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడు.
మొదటి భాగాన్ని మించి ఈ ‘పుష్ప2’ ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడే ఇతర భాషల నుండీ ‘పుష్ప2’ కి అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయి.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!